KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు? కొడంగల్ కుట్ర వెనుక బీఆర్ఎస్, కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్‌రెడ్డి అనుచరుడు సురేష్ గ్రామస్థుల్ని రెచ్చగొట్టి దాడి చేయించినట్లు విచారణలో తేల్చారు. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న సురేష్ కోసం గాలిస్తున్నారు. By srinivas 12 Nov 2024 | నవీకరించబడింది పై 12 Nov 2024 16:26 IST in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Kodangal : కొడంగల్ కుట్ర వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ సహా అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ నేతల హస్తముందని పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేత సురేష్ ఉన్నారని, ప్లాన్ ప్రకారమే అధికారును గ్రామంలోకి రప్పించి, గ్రామస్థుల్ని రెచ్చగొట్టి దాడి చేయించాడని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన సురేష్.. ఈ దాడికి మేందే పట్నం నరేందర్‌రెడ్డితో 42 సార్లు సురేష్ ఫోన్ కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. Also Read : మిస్ టీన్ యూనివర్స్ కీరిటం సాధించిన భారతీయ యువతి Also Read : హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? గ్రామస్థులను ఉసిగొల్పి దాడి.. ఇక ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లిన తీసుకెళ్లిన బోగమోని సురేష్.. గ్రామస్థులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇక నరేందర్ రెడ్డి.. సురేష్‌తో మాట్లాడుతూనే కేటీఆర్‌కు ఫోన్లు చేసినట్లు తేల్చారు. బోగమోని సురేష్‌పై రేప్ సహా పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లగచర్లలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: అందరికంటే ముందే ఆస్ట్రేలియా చేరిన కోహ్లీ.. పెర్త్‌లో అడుగుపెట్టగానే! కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి.. ఈ దాడి ఘటనపై ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. బోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని.. కలెక్టర్‌ను, అధికారులను పక్కకు తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగానే గ్రామస్థులతో దాడులు చేయించారని చెప్పారు. అయితే సురేష్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా గుర్తించామని.. అతడి స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ అని వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడులు చేసేలా సురేష్ అక్కడి గ్రామస్థులన రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని.. ఎవరూ కూడా వదంతులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత దాడి వెనుక ఎవరున్నా సరే..కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఐజీ నారాయణ రెడ్డి అన్నారు. ఇది కూడా చదవండి: TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు #ktr #brs #collector #kodangal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి