Karnataka: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం చర్చనీయమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 12 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇంటి యజమానులు అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారు. అద్దె సంగతి అటు పక్కన పెడితే.. అసలు అడ్వాన్స్ చూస్తేనే అవాక్కైపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also Read : KTRను బీజేపీ కాపాడుతుందా? ముందున్న మూడు ఆప్షన్లు ఇవే! రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్నిద్ కౌర్ అనే యువతి బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్లింది. అక్కడ కొంతకాలం ఉండేందుకు గది అద్దెకు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆమె గది అద్దెల ధరల చూసి షాకవుతోంది. తాజాగా ఓ అపార్ట్‌మెంట్‌లో గది అద్దెకు తీసుకోవడానికి వెళ్లింది. దాని రెంట్ నెలకు రూ.40 వేలు. అయితే ఆ గది తీసుకోవాలంటే రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని ఇంటి యజమానులు ఆమెను అడిగారు. దీంతో బెంగళూరులో ఇలాంటి భారీ అద్దెలతో తాను విసిగిపోయానని హర్నిద్ కౌర్ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది. Also Read: వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు ఐదు, పది నెలల అడ్వాన్స్ అడుగుతున్నారు దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ప్రస్తుతం తాము కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నామని వాపోయారు. ''ఢిల్లీ వంటి నగరాల్లో గది అద్దెకు తీసుకునేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్‌గా ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే తీసుకుంటారు. కానీ బెంగళూరులో ఐదు, పది నెలల మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారు'' అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. Also Read : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు ఇదిలాఉండగా బెంగళూరులో 2022 ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు అద్దెలు రెండు రేట్లు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలో అత్యంత ఖరీదైన రెసిడెన్షిల్ మార్కెట్‌గా బెంగళూరు నిలుస్తోంది. ఇళ్ల యజమానులు తమ ఆదాయంలో ఎక్కువ భాగం ఇంటి అద్దెల నుంచి పొందుతున్నారని పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు చెబుతున్నాయి. అమెజాన్, గూగల్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగస్థులు ఉంటున్నారనే అంచనాలు ఉన్నాయి. Also Read: కోర్టు మెట్లు ఎక్కిన నటి కస్తూరి! #flat-rent #bengaluru #karnataka #telugu-news #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి