/rtv/media/media_files/2024/12/05/0TGK4Kq5BP2WXRmrzjtm.jpg)
whatsapp Photograph: (whatsapp)
భారతదేశంలో సోషల్ మీడియా వినియోగం విషయంలో నిబంధనలను ఆయా సంస్థలు మరింత కఠినతరం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ కోట్ల కొద్ది అకౌంట్లను తొలగించగా, తాజాగా అదే బాటలోకి మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా చేరింది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ 2025 జనవరి 1 నుంచి 30 వరకు ఒక్క నెలలోనే దాదాపు 99 లక్షల (10 మిలియన్లు) భారతీయ ఖాతాలను నిషేధించినట్లు తెలుస్తుంది.
Also Read: Meerut Murder Case: మాదక ద్రవ్యాలకు బానిసలై..తిండి తినకుండ..!
ఇది కంపెనీకి సరికొత్త రికార్డని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే నెలలో ఈ స్థాయిలో అకౌంట్లను తొలగించడం ఇదే మొదటిసారని నిపుణులు పేర్కొంటున్నారు. భారతదేశంలో వాట్సాప్ వినియోగదారులు అనేక మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఈ యూజర్లలో అనేక మంది సామాన్య వ్యక్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులతోపాటు స్పామర్లు, మోసగాళ్లు, హ్యాకర్లు కూడా ఉన్నారని తేలింది.
ఈ క్రమంలోనే ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అనేక ఖాతాలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో చాట్‌లు, ప్రైవసీ, ఇతరులు పంపే సందేశాలు కూడా నిషేధానికి కారణమవుతున్నాయి. వాట్సాప్ ప్రధాన లక్ష్యం యూజర్ ప్రైవసీని దుర్వినియోగం చేయకుండా ఉండటమే.
జనవరి 1 నుంచి 30, 2025 మధ్య కాలంలో వాట్సాప్ 99 లక్షల ఖాతాల పై నిషేధం విధించింది. ఈ ఖాతాలు వివిధ కారణాలతో నిషేధించడం జరిగింది. వాటిలో నకిలీ ఖాతాలు, స్పామ్ సందేశాలు పంపడం, అనుమానాస్పద కార్యకలాపాలు సహా అనేక వాట్సాప్ విధానాలను ఉల్లంఘించడం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ నిషేధ చర్యలో భాగంగా దాదాపు 13.27 లక్షల ఖాతాలను ముందుగా, యూజర్ ఫిర్యాదులు అందకముందే, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా బ్లాక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వాట్సాప్ భద్రతా వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఈ క్రమంలో యూజర్లు వాట్సాప్ వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు సందేశాలు పంపిస్తే మీ అకౌంట్ కూడా బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
వాట్సాప్ భద్రత కోసం ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఒక వినియోగదారుల కార్యాచరణను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు ఒక ఖాతా నుంచి ఎక్కువమంది యూజర్లకు స్పామ్ సందేశాలు పంపితే లేదా నకిలీ సమాచారాన్ని పంపిస్తే, సిస్టమ్ వెంటనే ఆ ఖాతాను గుర్తించి, చివరకు నిషేధిస్తుంది. ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ సిస్టమ్ అనుమానాస్పద అంశాలను త్వరితగతిన గుర్తించి చర్య తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మరింత సురక్షితంగా, నమ్మకంగా ఉంచడంలో సహకరిస్తుంది.
వాట్సాప్ ద్వారా వినియోగదారులు వేధింపులు, స్పామ్ సందేశాలు లేదా మోసపూరిత కార్యకలాపాలను ఎదుర్కొన్నప్పుడు, వాటి గురించి ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే 9,474 వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు, WhatsApp 239 ఖాతాలను నిషేధించింది. ఈ క్రమంలో వినియోగదారుల ఫిర్యాదులపై కూడా మరింత వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది వాట్సాప్.
Also Read: Hamas-Israel: హమాస్ కీలక రాజకీయ నేత, ఆయన భార్య హతం!
Also Read: YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
accounts | block | telugu-news | latest-telugu-news | latest telugu news updates | whats-app