YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్‌...వారి మరణాల పై విచారణ!

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

New Update
ys vivek

ys vivek

వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ విచారించనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు. వివేకా హత్య తర్వాత శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. వివేకా హత్య కేసులో శ్రీనివాసులు రెడ్డి సాక్షిగా ఉన్నాడు. 

Also Read: Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్‌ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!

శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యతో ఈ కేసులో ప్రమేయం ఉన్న సాక్షుల మరణాలు మొదలయ్యాయి. శ్రీనివాసులు రెడ్డి తర్వాత వరుసగా కువైట్ గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి,వైయస్ అభిషేక్ రెడ్డి, రంగన్న మృతి చెందారు. దీంతో.. సాక్షుల మరణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసు విచారణ గురించి  వివేకా కుమార్తె సునీత.. శుక్రవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులతోపాటు, సీబీఐని కూడా ప్రతివాదులుగా చేర్చారు.

Also Read:  Hamas-Israel: హమాస్‌ కీలక రాజకీయ నేత, ఆయన భార్య హతం!

 ఈ క్రమంలో.. ఈ పిటిషన్ పై విచారణ జరగగా.. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదని న్యాయవాది పేర్కొన్నారు. 2019 మార్చి 14 అర్థరాత్రి ఈ హత్య జరిగిందని.. అనంతరం గత ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి విచారణ సీబీఐకి మారింది గాని, ఎలాంటి ఫలితం లేదన్నారు. ఈ కేసులో నిందితులందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు సునీత న్యాయవాదికి అనుమతి ఇచ్చింది. 

ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ పురోగతిని తెలియచేయాని తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఈ  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకూ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Also Read: Tummala Nageswara rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్‌.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!

Also Read:  Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!

ys-vivekananda | ys-viveka-murder-case | ys-vivekananda-reddy | ys-viveka-murder | ys-vivekareddy | ys-sunita | telugu-news | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు