/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
🔴Live News Updates
Tummala Nageswara Rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!
రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది.ఆ తర్వాత లేదని మంత్రి తేల్చి చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Thummala-jpg.webp)
రైతు రుణమాఫీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న వేళ.. సభలో రైతు సమస్యలు, రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ లాంటి అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేశారు.
Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!
సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ..
"రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు లక్షలలోపు రుణం ఉన్న కుటుంబాలు 25 లక్షల మంది ఉన్నట్టు తెలిసిందే. ఆ మేరకు.. రూ.20,616 కోట్లు జమ చేయటం జరిగింది.ఈ విషయం గురించి మీరు కన్ఫ్యూజ్ కావొద్దు.. జనాలకు కన్ఫ్యూజ్ చేయొద్దు." అంటూ తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు.
Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కొంత మంది రైతులకు రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్నవాళ్లు కూడా బాధపడాల్సిన పని లేదని.. ఆపైన ఉన్న మొత్తాన్ని మిత్తితో సహా క్లియర్ చేస్తే.. 2 లక్షల అప్పును ప్రభుత్వమే కట్టేస్తుందంటూ గతంలో పలు వేదికలపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తుమ్మల.. రెండు లక్షల వరకే రుణమాఫీ అని.. ఆ తర్వాత లేదని తేల్చేయటంతో.. ఈ ప్రకటనపై సర్వత్రా చర్చ మొదలైంది.
కాగా.. తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ఈ ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రెండు లక్షల పైన కూడా రుణమాఫీ చేస్తామని పబ్లిక్ మీటింగుల్లో, దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ.. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ అయిపోయిందని.. 2 లక్షలపైన రుణమాఫీ చేయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారని చెప్పుకొచ్చారు.
Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!
Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?
-
Mar 23, 2025 14:45 IST
కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
-
Mar 23, 2025 11:12 IST
Canada: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు
-
Mar 23, 2025 10:23 IST
YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
-
Mar 23, 2025 10:23 IST
Sports: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?