/rtv/media/media_files/2025/09/24/nia-2025-09-24-20-56-47.jpg)
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసులు ఒక ముఖ్యమైన వ్యక్తిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరాన్ వ్యాలీలో 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులకు రవాణా సౌకర్యం కల్పించిన మహ్మద్ కటారియా(26) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. జూలైలో ఆపరేషన్ మహాదేవ్ లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
Security agencies in Jammu & Kashmir have arrested Mohammad Yousuf Kataria, a 26-year-old resident of Kulgam, for allegedly providing logistical support to terrorists involved in the Pahalgam terror attack that killed 25 tourists five months ago. Kataria has been remanded to… pic.twitter.com/yJDgnte85L
— JioNews (@JioNews) September 24, 2025
ఉగ్రవాదులకు అడవుల గుండా
ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఇతర సామాగ్రిని ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా, దాని ఆధారంగా కటారియాను పట్టుకున్నట్లు సమాచారం. కుల్గామ్‌కు చెందిన కటారియా ఉగ్రవాదులకు అడవుల గుండా ప్రయాణించడంలో సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది. గతంలో ఈ దాడికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు పర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది, వారు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. అందులో సులేమాన్ అలియాస్ అసిఫ్‌ను ఈ ఘటనకు మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. మరో ఇద్దరిని జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు.
కాగా ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించింది. దీనిలో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.