Domestic Violence : ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

ఉత్తరాఖండ్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన వీడియో నెటిజన్లను తీవ్ర షాక్‌కు గురిచేసింది.ఈ వీడియోను చూసిన వారంతా నువ్వెంత మూర్కుడివిరా అంటూ తిట్టుకుంటున్నారు. ఈ ఫుటేజీలో భర్త తన భార్యను అపార్ట్‌మెంట్ బాల్కనీ రెయిలింగ్‌లకు వేలాడదీస్తున్నట్లు కనిపిస్తోంది.

New Update
 Domestic Violence

 Domestic Violence

Domestic Violence : ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన వీడియో నెటిజన్లను తీవ్ర షాక్‌కు గురిచేసింది.ఈ హృదయ విదారకరమైన వీడియోను చూసిన వారంతా నువ్వెంత మూర్కుడివిరా వేదవ అంటూ తిట్టుకుంటున్నారు. ఈ ఫుటేజీలో, ఒక భర్త తన భార్యను అపార్ట్‌మెంట్ బాల్కనీ రెయిలింగ్‌లకు వేలాడదీస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె భయంతో ఏడుస్తున్నప్పటికీ ఏమాత్రం కనికరించకుండా ఆమెను హింసిస్తున్న వీడియో సంచలనంగా మారింది. పక్కనే ఉన్నవారు ఆపమని కేకలు వేస్తు్న్న తీరు వీడియోలో స్పష్టంగా వినపడుతున్నాయి. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య భర్తల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో ఆమెను భర్త బిల్డింగ్‌ రెయిలింగ్‌కు వేలాడదీసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో పాటు స్థానికంగా గుర్తు తెలియని వ్యక్తి ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

 వైరల్‌ వీడియోలో కనిపించిన బాధిత మహిళ కాపాడాలని వేడుకుంటున్న కూడా వదలడంలేదు. ఆమె తన జీవితం మీద పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు చావుతో పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ మూర్కుడు తనను ఎక్కడ కిందపడేస్తాడో నని ఆమె గట్టిగా కేకలు వేస్తోంది. అదే సమయంలో, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర వ్యక్తులు ఆమె భర్తను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమెను పైకి లాగమని వారు అరవటం మొదలు పెట్టారు. కానీ అతను ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. బాధితురాలు భయంతో అరుస్తూ సహాయం కోసం కేకలు వేస్తుంది.  

Also Read: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం

ఆమె అరుపులకు అపార్ట్ మెంట్ లోని వారు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడారు. అయితే.. అతనికి తాగుడుకు భార్య డబ్బులు ఇవ్వనందుకు తలకిందులుగా వేలాడదీశాడని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో అపార్ట్‌ మెంట్ వాసులు  భర్తను పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అతడ్ని కూడా అలాగే తలకిందులుగా వేలాడదీయాలని కొంత మంది , పడేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాడు భర్తగా ఉండటం వేస్ట్ అని కొంత మంది ఫైర్ అవుతున్నారు.

Also Read: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు