Israel Attacks: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు,శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 130 మందితో పాటూ తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అగ్ర కమాండర్లున్నారు.

New Update
iran

Israel attack on Iran

మిడిల్ ఈస్ట్ రగిలిపోతోంది. రెండె రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉంది. నిన్న రాత్రి అవిశ్రాంతంగా ఇరు దేశాలు క్షిపణులతో దాడులు చేసుకున్నాయి. ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలెం పై దాడులు చేసింది. జెరూసలేం మరియు టెల్ అవీవ్ వంటి పెద్ద నగరాల్లో సైరన్‌లు నిరంతరం మోగుతున్నాయి. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ గా కూడా దాడులు చేసింది. ఇరాన్ లో పెద్ద చమురు డిపోలు, గ్యాస్ శుద్ధి కర్మాగారాలపై క్షిపణులను వదిలింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ దాడిలో 29 మంది పిల్లలు సహా 60 మంది మరణించారు. వీటిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ దాడులను మరింత తీవ్రతరం చేస్తానని అన్నారు. ఇరాన్‌లోని అన్ని అణు యూనిట్లను పూర్తిగా నాశనం చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యం. ఇరాన్‌లో ఐదు పెద్ద అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఫోర్డో, ఖోండాబ్, నటాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ ఉన్నాయి. 

ప్లాన్ ప్రకారం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్..

ఇజ్రాయెల్ ఒక ప్లాన్ ప్రకారం ఇరాన్ పై దాడి చేస్తోంది. ఆ దేశం వెన్నెముకపై దెబ్బ కొడుతోంది. ఇరాన్ చమురు డిపోలు, శుద్ధి కర్మాగారాలపై వరుసగా క్షిపణులు ప్రయోగించింది. రాజధాని టెహ్రాన్ సమీపంలోని షహ్రాన్ చమురు డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. అంతకు ముందు బుషెహర్ నగరానికి సమీపంలోని గ్యాస్ క్షేత్రం, అబాడాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడి జరిగింది. ఇరాన్ ఓడరేవుపై కూడా దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఇరాన్‌లోని బుషెహర్‌లోని ఫజ్ర్ గ్యాస్ శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు నిల్వలలో ఒకటి. ఈ శుద్ధి కర్మాగారం రోజుకు 125 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఇక గత 48 గంటల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ లో 130 మందికి పైగా మరణించారు. వీరిలో దాదాపు తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అనేక మంది ఇరాన్ అగ్ర కమాండర్లు ఉన్నారు. మరో 300మంది గాయపడ్డారని తెలుస్తోంది. 

 

 

Also Read: Israel: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..

 

Advertisment
Advertisment
తాజా కథనాలు