Sanjay Roy: సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు వద్దు.. ఉరిశిక్ష వేయాలని డిమాండ్

అభయ హత్యాచార కేసులో సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ రాయ్‌కు ఉరి తీయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఆధారాలతో హైకోర్టులో సవాలు చేస్తామన్నారు.

New Update
Sanjay Roy

Sanjay Roy

Sanjay Roy: కోల్‌కతాలో అభయ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష పడిన సంగతి తెలిసిందే. సోమవారం సీల్దా కోర్టు అతడికి మరణించే వరకు జీవిత ఖైదు శిక్షను విధించింది. అయితే కోర్టు తీర్పుతో పశ్చిమ బెంగాల్‌లో హై టెన్షన్ నెలకొంది. తీర్పుపై పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ రాయ్‌కు ఉరి తీయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మా దగ్గర అన్ని ఆధారులున్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజెన్లు దోషికి ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తు్న్నారు. కోర్టు తీర్పుకు ముందు సీఎం మమతా బెనర్జీ కూడా దోషికి ఉరిశిక్ష పడాలంటూ కోరారు. 

Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్

Also Read:జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

జీవిత ఖైదు వద్దు.. ఉరిశిక్ష వెయ్యాలి.. 

అయితే కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా వేసింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 102 మంది సాక్షుల వాగ్మూలం సేకరించింది న్యాయస్థానం.. సంజయ్ రాయ్‌ని మరణించే వరకు జైలులోనే ఉంచాలని స్పష్టం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా అంతకుముందు తమకు పరిహారం అవసరం లేదని.. న్యాయం కావాలని కోరారు. 

Also Read:Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ

ఇదిలాఉండగా సంజయ్ రాయ్‌ కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను నిర్దోషినని చెప్పుకొచ్చాడు. పోలీసులు  బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని... తప్పు చేసి ఉంటే రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలన్నాడు. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని చెప్పాడు. ఓ ఐపీఎస్ అధికారి ఇందులో ఇరికించాడండని ఆరోపణలు చేశాడు. ఒకవైపు తాను తప్పు చేయలేదు అంటూనే తనకు మారో అవకాశం ఇవ్వాలని.. ఉరిశిక్ష కాకుండా మరెదైనా శిక్షను విధించాలని కోరాడు. చివరికీ సీల్దా కోర్డు అతడికి చనిపోయేవరకు జైల్లో ఉంచేలా జీవిత ఖైదును విధించింది.  

Also Read:Jackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

Advertisment
తాజా కథనాలు