/rtv/media/media_files/2025/01/20/xRLGaBFRFVT36iZpLDGc.jpg)
Indian Army’s Daredevils
Indian Army: భారత ఆర్మీకి చెందిన 'డేర్‌డెవిల్స్'(Daredevils) అనే మోటర్ రైడర్ డిస్‌ప్లే టీమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. జనవరి 20న న్యూఢిల్లీ(Delhi)లోని కర్తవ్యపథ్‌లో కదిలే మోటర్‌బైక్‌లపై అత్యంత ఎత్తైన హ్యూమన్ పిరమిడ్ ఫీట్ చేసి అరుదైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు మోటార్‌బైక్‌లపై వెళ్తు్న్న 40 మంది ఏకంగా 20.4 ఫీట్ల ఎత్తులో హ్యూమన్ పిరమిడ్ ఫీట్ చేశారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ ఫీట్ కొనసాగించారు.
Indian Army's Daredevils Set New World Record at Kartavya Path
— IndSamachar News (@Indsamachar) January 20, 2025
The Motorcycle Rider Display Team "Daredevils" of Indian Army, achieved an extraordinary feat on 20 January 2025 at Kartavya Path, New Delhi, by creating a World Record for the highest Human Pyramid on moving… pic.twitter.com/t15IRHy1pH
Also Read: ఏడు విమానాలు, ది బీస్ట్ కారు : ట్రంప్ సెక్యూరిటీ చూస్తే మతి పోవాల్సిందే!
'డేర్‌డెవిల్స్' టీమ్ ప్రపంచ రికార్డు..
ఈ డేర్‌డెవిల్స్ టీమ్ ప్రతీఏడాది వివిధ అద్భుతమైన ఫీట్లు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా చేసిన ప్రదర్శనతో 33 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. దీంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Record), ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్(Asia Book of Records), లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్(Limca Book of Records) కూడా సాధించింది. అయితే తాజాగా చేసిన ఈ ఫీట్‌లో సిగ్నల్స్ కార్ప్స్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కె.వి.కుమార్ సైతం ఉన్నారు.
Also Read: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!
ఇదిలాఉండగా 1935లో ఈ డేర్‌డేవిల్స్ మోటర్ రైడర్ టీమ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ టీమ్ 1600 మోటర్‌బైక్‌ల ప్రదర్శనలు ఇచ్చింది. గణతంత్ర్య దినోత్సవం, ఆర్మీ డే పరేడ్స్, అలాగే వివిధ మిలిటరీ కార్యక్రమాల్లో అద్భుతమైన ఫీట్‌లు చేసి అందరీ దృష్టిని ఆకర్షించింది. వారు అంకితాభావం, అసాధారణమైన నైపుణ్యం భారత ఆర్మీకి ఆదర్శంగా కొనసాగుతూ వస్తోంది.
Also Read: యూట్యూబ్‌లో వీడియో చూసి బ్యాంకు దొంగతనానికి .. పాపం చివరికి!
Also Read: ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!