Kolkata Rape Case: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందుతుడైన సంజయ్‌రాయ్‌ను ఎట్టకేలకు సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. జనవరి 20న దోషికి శిక్ష విధించనుంది.