కోల్ కతా డాక్టర్ హత్యా*చార కేసులో బిగ్ ట్విస్ట్ | Big twist in Kolkata doctor's murder case | RTV
కోల్‌కతా హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. నిందితుడు తరఫున న్యాయవాది వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున న్యాయవాది అందుబాటులో లేరు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై సామూహిక హత్యాచారం జరగలేదని నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ నిర్ధరించింది. దర్యాప్తు తుదిదశకు చేరుకుందని త్వరలోనే న్యాయస్థానంలో అభియోగాలు దాఖలు చేస్తామని స్పష్టం చేసింది.
కోలకతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రముఖులు,సినీ తారలు నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా సింగర్ అర్జిత్ పాట రూపంలో తన గొంతును వినిపించారు. 'ఆర్ కోబ్' పేరుతో పాటను విడుదల చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోల్‌కతా డాక్టర్ కేసు పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి 3 వారాలు గడుస్తున్నా కోల్‌కతా పోలీసులు, CBI ఇంకా దోషులెవరో తేల్చలేదు. మరోవైపు తాను రేప్ చేయలేదంటూ నిందితుడు సంజయ్రాయ్ మాట మార్చి కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.
కోల్‌కతా అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా టెస్టులు జరిగాయి. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఒకవైపు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షల నిర్వహణ జరుపుతోంది. మరోవైపు ఈ ఉదయం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అతని సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించింది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అభయ తల్లిదండ్రులు తమ కూతురుకి జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో చాలామందికి సంబంధం ఉందని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.