Jackky Bhagnani: షూటింగ్ లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ భర్తకు గాయాలు!

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీ గాయాలపాలయ్యారు. అర్జున్ హీరోగా జాకీ నిర్మాతగా తెరకెక్కుతున్న 'మేరే హస్బెండ్‌కి బీవీ' షూటింగ్ సెట్ లో ప్రమాదం జరగడంతో వీరిద్దరూ గాయపడ్డారు.

New Update
rakul preeth husband

rakul preeth husband Jackky Bhagnani

Jackky Bhagnani:  అర్జున్ కపూర్ హీరోగా, రకుల్ ప్రీత్ భర్త  జాకీ భగ్నానీ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'మేరే హస్బెండ్‌కి బీవీ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం కీలక పోస్ట్ షేర్ చేసింది. జనవరి 18న షూటింగ్ సెట్ లో ప్రమాదం జరిగినట్లు తెలిపింది. అదృష్టవశాత్తు సెట్ లో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని ప్రకటించింది.

అయితే సెట్ లోని సీలింగ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ప్రమాదం జరగడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని.. అందులో హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. నిర్వహణ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం  భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు