Weather Update: IMD హెచ్చరిక.. ఆగస్టు 10 వరకు ఉరుములతో భారీ వర్షాలు..!

దేశరాజధాని ఢిల్లీలో ఆగస్టు 10 వరకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని తెలిపిందిజ

New Update
Weather Update

Weather Update

రోజు రోజుకూ వాతావరణం మారుతోంది. పొద్దు కూయకముందే మేఘాలు నల్లగా కమ్ముకుంటున్నాయి. చిన్న చిన్న చిరుజల్లులు పడుతూ.. పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎక్కువగా అల్పపీడన ప్రాంతం, తుఫాను గాలులు మధ్య.. ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలు విలవిల్లాడిపోతున్నాయి. 

Weather Update Today

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదలు, కొడచరియలు విరిగిపడటం వంటి విపత్కర ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకుని.. కూడు, గూడు, గుడ్డల్లేక విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో IMD వాతావరణ శాఖ మరొక షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తమిళనాడు, కేరళలో రాబోయే 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆగస్టు 5, 6 తేదీలలో.. కేరళ, తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

అంతేకాకుండా ఈశాన్య, తూర్పు భారతదేశంలో రాబోయే 7 రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆగస్టు 6-7 తేదీలలో మరాఠ్వాడ, ఆగస్టు 7-8 తేదీలలో కొంకణ్, గోవా, ఆగస్టు 8న మధ్య మహారాష్ట్రలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుఫాను గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఢిల్లీలో వాతావరణం 

మరోవైపు ఇవాళ ఢిల్లీలో కూడా తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది. అయితే ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీలుగా నమోదైందని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ అంచనా కేంద్రం (RWFC) తెలిపింది. ఆగస్టు 10 వరకు రాజధానిలో మేఘావృతమైన వాతావరణం, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

నిన్న హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. రెండు గంటలకు పైగా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయాయి. ఆ సమయంలో వాహన దారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంకొన్ని ఏరియాల్లోని వీధుల్లో వర్షపు నీరు చెరువులను తలపించాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 

HYDలో నేడు

ఇక ఇవాళ కూడా తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు హైదరాబాద్, వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్,కామారెడ్డి సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న IMD తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు