Weather Update Today: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. IMD హెచ్చరిక!
యూపీలోని అనేక ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సహరాన్పూర్, షామ్లి, ముజఫర్నగర్, బాగ్పత్, మీరట్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 6 వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.