Mariyam Nawaz: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

యుద్ధవాతవరణంలోనూ బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్‌ మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దాడి చేయలేరని వ్యాఖ్యానించారు.

New Update
Mariyam Nawaz

Mariyam Nawaz

Mariyam Nawaz: పహల్గాంలో ఉగ్రదాడికి ఉసిగొల్పడమే కాకుండా భారతీయుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం పాక్‌ అధికారులకు, మంత్రులకు పరిపాటయ్యింది. లోపల భయం నింపుకున్నా దాన్ని భయటకు కనిపించకుండా బెదిరింపు దోరణితో మాట్లాడతున్నారు. ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరగడంతో ఏ క్షణం ఏం జరుగుతుంతో అనే ఉత్కంఠ ప్రతి భారతీయుడిలో ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పాక్‌ కు ఎలా బుద్ధి చెప్పాలనే విషయంలో చర్చించేందుకు ఈ రోజు ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం జరగునుంది.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

ఇదిలా ఉండగా యుద్ధవాతవరణంలోనూ బలుపు మాటలు మాట్లాడుతున్న పాకిస్థాన్‌ అధికారులు, మంత్రుల జాబితాలో మరొకరు చేరారు. తాజాగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, అధికార పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ కుమార్తె  అయిన మరియం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “ఈరోజు భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కానీ అల్లాహ్ పాకిస్తాన్ సైన్యానికి దేశాన్ని రక్షించే శక్తిని ఇచ్చాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. 

 

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

“పాకిస్తాన్ అణ్వాయుధ శక్తి కాబట్టి ఎవరూ అంత సులభంగా దానిపై దాడి చేయలేరు. మన రాజకీయ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ.. బాహ్య దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ దళాల వెనుక ఉక్కు గోడలా మనం ఐక్యంగా ఉండాలి” అని ఆమె అన్నారు.”పాకిస్తాన్ బలం దాని అమరవీరుల త్యాగాల నుంచి వచ్చింది” అని మరియం అన్నారు. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో తన తండ్రి కృషి ఉందని చెప్పింది. పాకిస్తాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చడంలో నవాజ్ షరీఫ్ చారిత్రాత్మక పాత్ర పోషించారని ఆమె అన్నారు.

ఇది కూడా చూడండి: Iphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే!
 
అయితే నవాజ్‌ షరీఫ్‌ కూడా ఇంతవరకు పహల్గాం దాడిని ఖండించడం కానీ , ఆ అంశాన్ని ప్రస్తావించడం కానీ చేయలేదు. అయితే రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య వనరులను ఉపయోగించుకోవాలని మాత్రం సూచించాడు.  అంతేకానీ నవాజ్ దూకుడు వైఖరి తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) వర్గాలను ఉటంకిస్తూ డైలీ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ-పాక్‌ భేటీ.. థాంక్స్‌ చెప్పిన షెహబాజ్ షరీఫ్

టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ఇస్తాంబుల్‌లో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్ష జరిపామని పాక్‌ ప్రధాని తెలిపారు.

New Update
Pakistan PM Sharif meets Turkey President, thanks 'brother' for 'resolute support' during India-Pak tensions

Pakistan PM Sharif meets Turkey President, thanks 'brother' for 'resolute support' during India-Pak tensions

ఆపరేషన్ సిందూర్‌ పేరుతో భారత్‌ పాక్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ భారత్ దాడులను ఖండించింద. దీంతో ఆ దేశంపై భారత ప్రజలు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులు నిషేధించాలని, బాయ్‌కాట్‌ తుర్కియే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు ఎర్గోగాన్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ సమావేశమయ్యారు. 

Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!

ఇస్తాంబుల్‌లో ఆదివారం రాత్రి వీళ్లిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎక్స్‌లో వెల్లడించారు. '' నా ప్రియమైన సోదరుడు ఎర్డోగాన్‌తో గౌరవప్రదంగా సమావేశం జరిగింది. భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పుడు మాకు అండగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్ష జరిపాం. పాక్‌-తుర్కియే స్నేహబంధం సుధీర్ఘ కాలం పాటు కొనసాగాలంటూ'' పోస్టులో రాసుకొచ్చారు.  

Also Read: హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర

మరోవైపు దీనిపై ఎర్డోగాన్‌ సైతం స్పందించారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహబంధం ఉందని తెలిపారు. రాజకీయ, వాణిజ్యం రంగాల్లో చారిత్రక బంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్‌-టర్కీ భేటీ కావడం ఇదే మొదటిసారి. అయితే భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఈ భేటీ ప్రధాన్యం సంతరించుకుంది. 

Also read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Also Read: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

 telugu-news | turkey | pakistan | rtv-news

Advertisment
Advertisment
Advertisment