Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

అక్షయ తృతీయ రోజున పూజ మందిరం, బీరువా లేదా ఇంట్లోని ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసి పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అసలు అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

author-image
By Archana
New Update
akshaya tritiya 2025

akshaya tritiya 2025

Akshaya Tritiya 2025:  హిందూ ధర్మంలో అక్షయ తృతీయ పండగకు  చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తృతీయ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజు చేసిన దానాలు, పుణ్య కార్యాలు ఎన్నటికీ అక్షయంగా (క్షీణించకుండా) ఉంటాయని ప్రజల నమ్మకం. అక్షయ తృతీయ రోజున సూర్యుడు మరియు చంద్రుడు అత్యంత శుభస్థితిలో ఉంటారు. అంతేకాదు సత్యయుగం,  త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమైనట్టు పురాణాల్లో ఉంది.  శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చిన రోజుగా కూడా  దీనిని  చెబుతారు. ఈ ప్రత్యేకమైన రోజున ఏదైనా ఏదైనా కొత్త పని ప్రారంభించడం, బంగారు, భూమి కొనుగోలు చేస్తే శుభం చేకూరుతుందని విశ్వాసం. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయకు తిథి వచ్చింది. 

ఇది కూడా చూడండి: Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

అయితే అక్షయ తృతీయ రోజున పూజ మందిరం, బీరువా లేదా ఇంట్లోని ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసి పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అసలు అక్షయ పాత్రను ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

అక్షయ పాత్ర ఎలా చేసుకోవాలి

  • ముందుగా ఒక చిన్న వెండి, ఇత్తడి, కంచు, లేదా మట్టి గురిగిని(కుండ) ఇంటికి తెచ్చుకోవాలి. 
  • ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు, కర్పూరం, జవ్వాది, రోజ్ వాటర్ కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తెచ్చుకున్న కుండకు ఎక్కడా గ్యాప్ లేకుండా పూయాలి. 
  • ఇప్పుడు మళ్ళీ మరో గిన్నెలో కుంకుమ తీసుకొని దానిలో.. కొద్దిగా జువ్వాది, పచ్చకర్పూరం, కర్పూరం, రోజ్ వాటర్ వేసి మిశ్రమంగా కలపాలి. 
  • అనంతరం ఈ కుంకుమ మిశ్రమాన్ని ఉంగరపు వేలికి అంటించుకొని పసుపు రాసిన కుండపై  "శ్రీం" అని రాయాలి. ఆ తర్వాత అక్షరానికి రెండు  వైపుల కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా ముందుగా అక్షయ పాత్రను అలంకరించుకోవాలి. 


    ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

అలంకరణ తర్వాత ఏం చేయాలి

  • అక్షయ పాత్రను అలంకరించిన తర్వాత.. దానిలో కొద్దిగా పసుపు, కర్పూరం పొడి, కొంచెం రాళ్ళ ఉప్పు పోయాలి. ఇలా చేయడం వల్ల అది అక్షయ పాత్రగా మారుతుంది. 
  • ఇప్పుడు ఆ పాత్రలో ఒక ఎరుపు రంగు గుడ్డ ముక్క వేసి అందులో కొంత డబ్బును ఉంచాలి. అలా పాత్రలో ఉంచిన డబ్బును మళ్ళీ మంగళవారం వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ డబ్బును బీరువాలో లేదా డబ్బు దాచుకునే స్థలంలో దాచుకుంటే మీ సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
    ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం..జిప్ లైన్ ఆఫరేటర్ పై ఎన్ఐఏ ఫోకస్

latest-news | telugu-news | akshaya-tritiya

Advertisment
తాజా కథనాలు