/rtv/media/media_files/2025/04/30/rhiQ1C8Vj0Atw6k79IBE.jpg)
DC VS KKR
డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. ఈరోజు సరిగిన మ్యాచ్ లో కోలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. డుప్లెసిస్ 62, అక్షర్ పటేల్ 43 విప్రాజ్ నిగమ్ 38 పరుగులు చేసి పోరాడినప్పటికీ పలితం దక్కలేదు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. 205 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన డిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో అభిషేక్ (4) రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత వచ్చిన ఇద్దరు కూడా తొందరగానే అవుట్ అయ్యారు. తరువాత అక్షర్ పటేల్, డుప్లెసిస్ కలిసి పెద్ బాగస్వామ్యమే నిలిపారు. ఇద్దరూ ఐదో వికెట్ కు 76 పరుగులు జోడించారు. అయితే కోలత్తా బౌలర్ నరైన్ వీళ్ళని విడదీశాడు. దీంతో ఢిల్లీ మ్యాచ్ మీద పట్టును కోల్పోయింది. విప్రాజ్ నిగమ్ ప్రయత్నం చేసిన్పటికీ మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు.
ఎవరు ఎంత స్కోర్ చేశారంటే?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు ముందు 205 టార్గెట్ ఉంది. కేకేఆర్ బ్యాటర్లలో రఘవంశీ 44 పరుగులు, సింగ్ 36 పరుగులు చేశారు. రఘువంశీ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహ్మనుల్లా (26), సునీల్ నరైన్ (27), అజింక్య రహానె (26), వెంకటేశ్ అయ్యర్ (7), రింకు సింగ్ (36), రస్సెల్ (17), పొవెల్ (5), రాయ్ (0) పరుగులు చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, చమీర 1 వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | dc-vs-kkr