Iphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఇందులో ఐఫోన్ 17 ప్రో సెప్టెంబర్ 11 - 13 మధ్య లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,39,999 ఉంటుంది. ఇది బ్లాక్, వైట్, గ్రే, గోల్డ్ వంటి కలర్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ లీకైన సమాచారం.

New Update
Iphone 17 Pro Launch Date (1)

Iphone 17 Pro Launch Date

ఆపిల్ ఐఫోన్లకు భారత దేశంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఒకప్పటి కంటే ఇప్పుుడు ఐఫోన్లు వాడే వారి సంఖ్య బాగా పెరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు సైతం ఐఫోన్లు కొంటున్నారు. ధర వేలల్లో ఉన్నా.. ఏదో ఒక రూపంలో కొనుక్కుని వాడుతున్నారు. ఇక వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు ఆపిల్ కంపెనీ సైతం కొత్త కొత్త సిరీస్‌లను ప్రతి ఏడాది అందుబాటులోకి తీసుకొస్తుంది. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మొత్తం 16 సిరీస్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 16 సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ ఏడాది ఐఫోన్ 17 సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ప్రతి ఏడాది లాగే.. ఈ సారి కూడా ఈ లైనప్‌ను సెప్టెంబర్ నెలలో లాంచ్ చేయబోతుంది. ఈ కొత్త సిరీస్ గతం కంటే డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లు, పనితీరు, ఆపిల్ ఇంటెలిజెన్స్ పరిధిని విస్తరిస్తుంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 మాక్స్ మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. తాజాగా ఐఫోన్ 17 ప్రో గురించి పలు లీక్‌లు బయటకొచ్చాయి. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

ఐఫోన్ 17 ప్రో లాంచ్ 

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 11 - 13 మధ్య లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మోడల్స్ లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత కొన్ని వారాల్లో యుఎస్, భారతదేశంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

అంచనా ధర

ఐఫోన్ 17 ప్రో ధర కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మోడల్‌ను రూ.1,39,999 ప్రారంభ ధరకు లాంచ్ చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

ఐఫోన్ 17 ప్రో డిజైన్‌లో మార్పులు

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 ప్రోలో డిజైన్ మార్పు చేసే అవకాశం ఉంది. ఈసారి కంపెనీ టైటానియం ఫ్రేమ్‌ను తొలగించి తేలికైన అల్యూమినియం, గాజు నిర్మాణంతో దీనిని తీసుకురావచ్చు. దీని వల్ల ఫోన్‌ తేలికగా, పట్టుకోవడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా వెనుక కెమెరా సెటప్‌లో కూడా పెద్ద మార్పు ఉండే అవకాశం ఉంది. 

ఐఫోన్ 17 ప్రో కలర్ ఆప్షన్స్

ఇక కలర్ వేరియంట్ల విషయానికొస్తే.. ఆపిల్ క్లాసిక్ షేడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బ్లాక్, వైట్, గ్రే, గోల్డ్ వంటి కలర్‌లతో వచ్చే అవకాశం ఉంది.

iphone-17-slim | apple-iphone | latest-telugu-news | telugu-news

Advertisment
తాజా కథనాలు