/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-18-19-48.jpg)
Rahul Gandhi
బిహార్‌లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రను విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ' పేరుతో బిహార్‌లో ఓట్లను తొలగించడం, చేర్చడం లాంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఓటు చోరీకి ఇండియా కూటమి అనుమతించబోదని.. పేదల ఓటు హక్కును వాళ్ల నుంచి దూరం కానీయమని స్పష్టం చేశారు.
Also Read: ఈ ప్రదేశాలకు వెళ్తే.. రావడం కష్టమే.. భయంతో చనిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు!
'' అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు చోరీ అవుతున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎక్కువగా సీట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదే విజయమని అంచనాలు వచ్చాయి. కానీ 4 నెలల్లోనే కోటి మంది కొత్త ఓటర్లు వచ్చారు. దీంతో బీజేపీ కూటమి గెలిచింది. ఓట్లు ఎక్కడ పెరిగాయో.. అక్కడ బీజేపీ విజయం సాధించింది. మొత్తానికి ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏం చేస్తుందో అందరికీ ఇప్పుడు తెలిసింది. ఓట్ల చోరీ వ్యవహారాన్ని నేను బయటపెడితే ఎన్నికల సంఘం నా నుంచి అఫిడవిట్‌ను కోరింది. బీజేపీ నేతలు ఇలాంటి వాదనలు చేస్తే మాత్రం ఇలా అడగలేదు. బీజేపీ, RSS భారత రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయంటూ'' రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
Also Read: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు ఎన్నికల సంఘం బీజేపీ ప్రభుత్వానికి ఏజెంట్‌లా పనిచేస్తోందని సెటైర్లు వేశారు. బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు NDA ప్రభుత్వాన్ని గద్దె దించుతారని పేర్కొన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా SIR పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఓటు హక్కును ఈసీ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ग़रीब की ताक़त है उसका वोट - यही उसका हक़, उसकी आवाज़, उसकी पहचान है।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2025
आज वही ताक़त छीनी जा रही है - SIR के ज़रिए वोट चोरी की साज़िश चल रही है।
हम हर कीमत पर वोट चोरी रोकेंगे!#VoterAdhikarYatrapic.twitter.com/jsI1WnNqSz
Also Read: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ
ఇదిలాఉండగా ఇటీవల ఈసీ బిహార్‌లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై దుమారం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారని విపక్ష పార్టీలు ఆరోపించాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఈసీ కూడా వివరణ ఇచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దీని గురించి మాట్లాడుతూ.. పార్టీల మధ్య మేము ఎలాంటి వివక్ష చూపించలేదన్నారు. ఈసీకి ఎలాంటి భేదభావాలు లేవని తెలిపారు. ఓటు చోరీ జరిగిందని ఈసీని విమర్శించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. SIRలో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చని.. సంస్కరణల్లో భాగంగానే ఓటర్ల జాబితాను తాము సవరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: అలస్కా చర్చల్లో విజేత పుతిన్..ప్రపంచ నాయకుడిగా నిరూపణ