/rtv/media/media_files/2025/08/17/bhangarh-fort-2025-08-17-17-53-30.jpg)
Bhangarh Fort
దేశంలో ఎన్నో అందమైన, భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఎంత భయంకరమైన ప్రదేశాలు అని చెప్పినా కూడా కొందరు వీటిని చూడటానికి ఎంతో ఇష్టంతో వెళ్తుంటారు. పొరపాటున వెళ్తే మాత్రం భయంతో తిరిగి వస్తారు. ఇందులో కొన్ని ప్రదేశాలకు వెళ్తే భయంతో చనిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదట. అయితే దేశంలో అంత భయంకరమైన ప్రదేశాలు ఏవి? ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఇక్కడికి వెళ్తే భయపడతారు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Best Saving Schemes for Women: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!
భాన్‌గర్ కోట, రాజస్థాన్
అల్వార్ జిల్లాలోని భాన్‌గర్ కోట భారతదేశంలోని అత్యంత భయానకమైన కోటలలో ఇది ఒకటి. అప్పట్లో సింఘియా అనే తాంత్రికుడు యువరాణి రత్నావతిపై తన ప్రేమ ప్రయత్నం విఫలమైన తర్వాత కోటను శపించాడని పురాణాలు చెబుతున్నాయి. రాత్రిపూట కోట శిథిలాలలో అరుపులు, నీడలు కనిపిస్తాయని ప్రజలు చెబుతుంటారు. దీంతో సాయంత్రం తర్వాత ఈ కోటలోకి ఎవరూ కూడా వెళ్లకూడదని భారత పురావస్తు సర్వే సంస్థ నిషేధించింది.
Bhangarh Fort (Rajasthan):
— 𝐺𝑎𝑏𝑟𝑖𝑒𝑙 𓃥 𝐵𝑎𝑏𝑦 (@angelan49555542) June 13, 2025
This fort is frequently cited as one of the most haunted places in India, with stories of a curse and unexplained phenomena. Entrance is prohibited after sunset due to alleged paranormal activity. pic.twitter.com/cavjPc8a1J
కుల్ధారా గ్రామం, రాజస్థాన్
జైసల్మేర్ సమీపంలోని కుల్ధారా గ్రామాన్ని ఒక రాత్రి పాలివాల్ బ్రాహ్మణులు విడిచిపెట్టారనే కథ ఉంది. అయితే వారు గ్రామాన్ని విడిచిపెట్టేటప్పుడు శపించి, దాన్ని నివాసయోగ్యంగా మార్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న పర్యాటకులు భయంకరమైన నిశ్శబ్దాన్ని, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు, అడుగుల శబ్ధాన్ని గుర్తిస్తుంటారట.
డ్యూమాస్ బీచ్, గుజరాత్
సూరత్ సమీపంలోని ఈ నల్ల ఇసుక బీచ్ ఒకప్పుడు దహన సంస్కారాల స్థలంగా వాడేవారు. అయితే రాత్రిపూట ఇక్కడ తెలియని గొంతులు, నీడలు, తప్పిపోయిన వ్యక్తుల శబ్ధాలు వినిపిస్తుంటాయి. అందుకే రాత్రిపూట బీచ్‌లో ఉండకూడదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
అగ్రసేన్‌కి బావలి, ఢిల్లీ
ఈ పురాతన మెట్ల బావి చాలా ప్రసిద్ధ చెందింది. ఇందులో మొత్తం 108 మెట్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ మెట్లు దిగుతున్నప్పుడు వింత భయం, చీకటి నీటిలో దూకాలనిపించే ఆలోచనలు వస్తాయని స్థానికులు చెబుతున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ఒక హాంటెడ్ స్టూడియోగా పేరు ఉంది. షూటింగ్ సమయంలో సాంకేతిక లోపాలు, అద్దాలపై ఉర్దూలో రాయడం, మహిళల దుస్తులు మార్చుకునే గదులలో వింత సంఘటనలు జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.
డిసౌజా చాల్, ముంబై
మాహిమ్ ప్రాంతంలోని ఈ చాల్‌లో బావిలో మునిగిపోయిన మహిళ ఆత్మ వెంటాడుతుందని స్థానికులు అంటున్నారు. రాత్రిపూట ఆమెను చూసినట్లు నివేదికలు ఉన్నాయి, కానీ ఆమె ఎవరికీ హాని చేయలేదు.
ఇది కూడా చూడండి: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.