Viral Video: ఓరీడి రీల్స్ పిచ్చి తగలెయ్య.. కొంచెముంటే ప్రాణాలే పోయేవి కదరా! - వీడియో చూశారా?

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఓ యువకుడు ప్రాణాలను పణంగా పెట్టాడు. ట్రైన్ వచ్చే సమయంలో రైలు పట్టాలపట్టాలపై పడుకున్నాడు. దాన్ని మరో యువకుడు రికార్డ్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో TGSRTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

New Update
VIRAL VIDEO..

ప్రస్తుత కాలంలో రీల్స్ పిచ్చి ఎక్కువైపోయింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు, రకరకాల విన్యాశాలు చేస్తున్నారు. అదే సమయంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటిదే తాజాగా ఓ యువకుడు రీల్స్ పిచ్చిలో పడి ఫేమస్ కోసం దారుణమైన సాహసానికి ఒడిగట్టాడు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ఫేమస్ కోసం పిచ్చి చేష్టలు

ఏకంగా ట్రైన్ వచ్చే సమయంలో రైలు పట్టాలపై పడుకుని విన్యాశం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే.. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

ఓ యువకుడు ఫేమస్ కావడం కోసం ఏకంగా రైలు పట్టాలపై పడుకున్నాడు. రైలు ఎదురుగా వస్తున్న సమయంలో తల కిందికి పెట్టి తిన్నగా పడుకున్నాడు. అతడిపై ట్రైన్ వెళ్లినంతవరకు పైకి లేవలేదు. అది వెళ్లిపోయిన అనంతరం పైకి లేచి లేచి తానేదో పెద్ద విజయం సాధించినట్లు అరిచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇదే వీడియోపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం! అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? అని ప్రశ్నించారు. ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు అని ఫైర్ అయ్యారు. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అని తెలిపారు. 

latest-telugu-news | telugu-news | viral-videos | viral-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు