/rtv/media/media_files/2025/01/27/nUYvUpkqr4qEImW37oS7.jpg)
Chandra Babu and Vijaya Sai Reddy
Vijaya Sai Reddy: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం అందరినీ ఆకట్టుకుంది. శకటం ముందు వినాయకుడు, వెనకాల వేంకటేశ్వర స్వామి, బొబ్బిలి వీణలు, బొమ్మలకొలువు చిత్రాలతో రూపొందించిన ఈ శకటం తెలుగువారి సంస్కృతిని ప్రదర్శించింది. అయితే ఈ శకటంపై తాజాగా మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీకి చెందిన శకటం రిపబ్లిక్ వేడుకల్లో పురాతన ఏటికొప్పాక బొమ్మలను అద్భుతంగా ప్రదర్శించిందని కొనియాడారు. ఇది సంప్రదాయ, హస్తకళ, స్థిరత్వ సంపూర్ణ సమ్మేళనం అంటూ ప్రశంసించారు.
Also Read : రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!
Andhra Pradesh’s Republic Day tableau beautifully showcased the ancient art of Etikoppaka Toys – a perfect blend of tradition, craftsmanship, and sustainability. pic.twitter.com/fnV1v4tPue
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025
చంద్రబాబు సర్కార్‌పై విజయసాయి ప్రశంసలు..
అయితే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపొందించిన ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని విజయసాయిరెడ్డి ప్రశంసించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు, లోక్‌శ్‌తో పాటు టీడీపీ నేతలను తిట్టే విజయసాయిరెడ్డి, ఈసారి వాళ్లని మెచ్చకునేలా పొగడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయసాయిరెడ్డిపై కాకినాడ సీపోర్ట్స్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై ఉన్న కేసు నుంచి తప్పించుకునేందుకు ఇలా కూటమి ప్రభుత్వాన్ని పరోక్షంగా పొగిడారంటూ మరికొందరు భావిస్తున్నారు.
Also Read: పూణెలో విస్తరిస్తున్న భయాంకరమైన వ్యాధి.. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు
అంతేకాదు విజయసాయిరెడ్డి రాజీనామాకు కాకినాడ సీపోర్ట్స్ కేసు అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి. ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని అన్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి సైతం తన రాజీనామాపై స్పందించారు. తాను పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్‌తో అన్నీ మాట్లాడిన తర్వాతే ఈ పని చేశానన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని, కాకినాడ పోర్టు కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Also Read: ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!