పాలిటిక్స్ కు ఇక దూరం అంటూ విజయసాయిరెడ్డి ప్రకటనపై వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి, జగన్‌కు విజయసాయి అత్యంత నమ్మకమైన వ్యక్తి అన్నారు. ఢిల్లీలో జగన్ వ్యవహారాలన్ని విజయసాయి చూసుకున్నారన్నారు. గవర్నమెంట్ వచ్చాక విజయసాయికి విశాఖ, ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ బాధ్యతలు ఇచ్చాక కొన్ని తప్పులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజీనామాకు కాకినాడ సెజ్ కారణమని అంటున్నారని కేతిరెడ్డి బాంబ్ పేల్చారు.
ఈడీ, సీబీఐతో టార్గెట్..
ఈడీ, సీబీఐలతో ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదన్నారు. విజయసాయి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఇదే అసలు కారణమన్నారు. ఈడీ, సీబీఐల భయంతోనే రాజీనామా చేశారన్నారు. లేకపోతే ఆయన ఇప్పుడు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేతిరెడ్డి.
ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!
ఈడీ, సీబీఐల భయంతోనే విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు విజయసాయి రెడ్డి అతీతుడేం కాదన్నారు. విజయసాయి ఈ విషయాన్ని ఖండించినప్పటికీ ఇదే అసలు కారణమన్నారు.