PM Modi Convoy: PM మోదీ కాన్వాయ్ భద్రతా లోపం.. రోడ్డు మీదే కార్లు వాటర్ వాషింగ్!

ప్రధాని మోదీ కాన్వాయ్‌ కార్లు బీహార్‌లో ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్‌లో శుభ్రం చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉండే ఆ కార్లు బహిరంగంగా అలా శుభ్రం చేయించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Videos of PM Modi convoy

సోషల్ మీడియాలో ప్రధాని మోదీ భద్రతకు సంబంధించిన ఓ వీడియో చక్లర్లు కొడుతోంది. అయితే దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌(PM Modi Convoy)లోని కార్లు బీహార్‌లో ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్‌(Local Car Wash Station)లో శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌(Viral Video) గా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ప్రధాని కాన్వాయ్ కార్లు బహిరంగంగా శుభ్రం చేయించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని భద్రతా వైఫల్యంగా చెబుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ప్రధాని కాన్వాయ్‌లో ఉపయోగించే కార్లలాగే ఉన్న అనేక హై-ఎండ్ బ్లాక్ SUV కార్లు ఓ లోకల్ కార్ వాష్ సెంటర్‌లో శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను ఆ కార్ వాష్ యజమాని 'విశ్వకర్మ మోటార్ విజయ్' స్వయంగా తీసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ పోస్ట్ తొలగించబడినప్పటికీ, నెటిజన్లు దానిని డౌన్‌లోడ్ చేసి షేర్ చేస్తున్నారు.

Also Read :  సల్మాన్ ఖాన్‌ని 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్

PM Modi Convoy Cars Being Cleaned At A Regular Service Centre

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. ప్రధాని ప్రయాణించే మెర్సిడెస్-మేబాచ్ ఎస్650 గార్డ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్న వాహనాలు, కేవలం SPG పర్యవేక్షణలో, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలలోనే శుభ్రం చేయబడాలి. కానీ, ఒక సాధారణ కార్ వాష్‌లో అవి కనిపించడం భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read :  ఐదుగురు చిన్నారుల‌కు HIV.. బ్ల‌డ్ బ్యాంక్ నిర్లక్ష్యం

ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "ప్రధాని ప్రయాణించే వాహనం స్థానిక కార్ వాష్‌లో శుభ్రం అవుతుండటం షాకింగ్‌గా ఉంది! ప్రభుత్వ వ్యవస్థలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండవా? ఇది పెద్ద భద్రతా విపత్తుకు దారితీయవచ్చు" అంటూ ప్రశ్నించారు. మరికొందరు, ఇవి ప్రధాని కాన్వాయ్‌లోని 'మెయిన్' వాహనాలు కాకపోవచ్చు, కేవలం ఎస్కార్ట్ వాహనాలు అయి ఉండొచ్చని వాదిస్తున్నారు.

అయితే, ప్రధాని కార్యాలయం లేదా సంబంధిత భద్రతా ఏజెన్సీల నుంచి ఈ వీడియోపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, దేశ అత్యున్నత నాయకుడి భద్రతకు సంబంధించిన వాహనాలు ఇలా బహిరంగ ప్రదేశంలో కనిపించడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భద్రతా సిబ్బంది ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు