Salman Khan: సల్మాన్ ఖాన్‌ని 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్

బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌పై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన్ని 'ఉగ్రవాది'గా ప్రకటిస్తూ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

New Update
Salman Khan,

బాలీవుడ్ స్టార్ యాక్టర్(bollywood-actor) సల్మాన్ ఖాన్‌పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా, ఆయనను 'ఉగ్రవాది'గా ప్రకటిస్తూ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రియాద్‌లో జరిగిన 'జాయ్ ఫోరమ్ 2025'లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, మధ్యప్రాచ్య దేశాలలో పనిచేస్తున్న దక్షిణ ఆసియా వలసదారుల గురించి మాట్లాడుతూ, "బలూచిస్తాన్ ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు అందరూ సౌదీ అరేబియాలో కష్టపడి పనిచేస్తున్నారు" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలలో, సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి ప్రత్యేకంగా పేర్కొనడం పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది.

Also Read :  ప్రభాస్ తో సినిమా అంటే సీక్వెల్ ఉండాల్సిందేనా..?

Salman Khan As A Terrorist

Also Read :  మాస్ జాతర రిలీజ్ పోస్ట్ పోన్..? రీజన్ ఇదే!!

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతునిచ్చేలా ఉన్నాయని పాక్ ప్రభుత్వం భావించింది. దీంతో, పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌ను 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 'నాల్గవ షెడ్యూల్'లో చేర్చింది. ఈ జాబితాలో చేర్చబడిన వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానించబడినందున, పాకిస్తాన్ చట్టాల ప్రకారం వారు అనేక ఆంక్షలకు లోబడి ఉంటారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు స్వాగతించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ వివాదంపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాకిస్తాన్‌కు, సొంత దేశ అంతర్గత విభేదాలపై అంతర్జాతీయంగా ప్రముఖుడి వ్యాఖ్యలు కొత్త తలనొప్పిగా మారాయి. అంతర్జాతీయ వేదికపై ఈ అంశంపై చర్చ మొదలవడం పాక్‌కు ఇబ్బందికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు