TG Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం!

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ పీఎస్ పరిధి షీర్‌బాగ్‌ చౌరస్తా దగ్గర బైక్‌పై వెళ్తున్న భర్యాభర్తలను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు లాలగూడకు చెందిన ఆడోమ్‌ క్యారమ్‌(67)గా గుర్తించారు.

New Update
 Road Accident hyd

Road Accident

TG News: ఈమధ్య కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోతోంది. వాహనదారులకు అవగాహన లేకపోవడం వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని హైదరాబాద్‌ వాసులు వాపోతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం కలకలం రేపుతోంది.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని..

భాగ్యనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జరిగింది. బైక్‌పై వెళ్తున్న  దంపతులను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందాగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఆబిడ్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆబిడ్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలగూడకు చెందిన సంత జసంత ఆమె భర్త ఆడోమ్‌ క్యారమ్‌(67) బైక్‌పై బషీర్‌బాగ్‌ చౌరస్తా మీదుగా ఉదయం 7:30 నిమిషాల సమయంలో ఆబిడ్స్‌ ఛాపెల్‌ రోడ్డులో వెళ్తున్నారు. అదే టైంకు ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఎన్‌ఎల్‌ 01బీ2900 బస్సు అతివేగంగా రాంగ్‌ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొంది. ఎల్బీ స్టేడియం, అగ్రికల్చర్‌ కమిషనర్‌ కార్యాలయం దగ్గర భార్యాభర్తల బైక్‌ ఢీకొనటంతో తీవ్రంగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కూరగాయలు తినాలి

మితిమీరిన వేగం వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతి చెందిన వ్యక్తి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాపడిన మహిళను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  సంత జసంత ఛాపెల్‌రోడ్‌లోని సెవెంత్‌ డే అడ్వెంటిస్ట్‌ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఉదయం భార్యను స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. తల్లిదండ్రుల ప్రమాదంపై కుమారుడు క్రిస్టోపర్‌ క్యారమ్‌ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. బస్సును అబిడ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. తర్వలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఎప్పుడు టీకాలు వేయించుకోవాలి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు