/rtv/media/media_files/2025/02/04/kVIX2c3oVHSUHJ80rUo4.webp)
KCR-Narendra-Modi
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కు సకలమ్మ ఐదో సోదరి. ప్రతి రాఖీపండుగ నాడు ఆమె తన చేతికి రాఖీ కట్టేదని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
అయితే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. సోదరి మరణానికి చింతిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని మోదీ కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ బాధ నుంచి త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మోదీ ఈ లేఖలో ఆకాంక్షించారు.
Also Read: Watch Video: మాతృభాషలో రాసేందుకు తిప్పలు పడ్డ రాష్ట్ర మంత్రి.. వీడియో వైరల్
Also Read : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్....
Prime Minister Modi Letter To KCR
"మీ సోదరి సకలమ్మ మరణం మీకు దుఃఖం, బాధతో కూడుకున్నది. ఆ నష్టం మీకు ఎప్పటికీ పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. సకలమ్మ కుటుంబాన్ని పోషించినతీరు, ఆమె తన కుటుంబానికి పంచిన ప్రేమ ప్రతి ఒక్కరి హృదయాలలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. సకలమ్మగారు మీ స్మృతులలో నిలిచి ఉంటారు.అందరి హృదయాలలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. ఆమె గురించి తెలిసిన వారందరికీ ఆమె ప్రేమ, గౌరవం ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఆమె అందించిన విలువలు కుటుంబానికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ క్లిష్ట సమయంలో ఆమెతో గడిపిన జ్ఞాపకాలు మీకు ఓదార్పును అందించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు, కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఈ నష్టాన్ని, తట్టుకునే శక్తి, ధైర్యాన్ని మీకు ఇవ్వాలని దేవున్ని కోరుకుంటున్నాను.' అంటూ ఈ మేరకు కేసీఆర్ కు సంతాప సందేశాన్ని ప్రధాని పంపించారు.