Viral News: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. పెళ్లైన రెండో రోజే వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుడి ఫ్యామిలీ ఆమె బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను భార్యను అంగీకరించనంటూ వరుడు తేల్చి చెప్పేశాడు.  

New Update
marriage,

Uttar Pradesh Prayagraj new bride delivery case

Viral News: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న యువకుడికి వధువు ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లైన రెండు రోజులకే ఆమె అత్తగారింట్లో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇంట్లో అడుగుపెట్టి శుభదినం ఇలాంటి ఘటన ఎదురుకావడతో ఒక్కసారిగా ఆ వరుడి కుటుంబం ఉలిక్కిపడింది. దీంతో తాము దారుణంగా మోసపోయానని గుండెలు బాదుకుంటూ వధువు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి. 

Also read: Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం

బంధువులందరికీ టీ, కాఫీలు ఇచ్చి..

ఈ మేరకు పోలీసులు, వరుడి బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 24వ యువ జంటకు ఘనంగా పెళ్లి జరిగింది. దీంతో పెళ్లైన రెండో రోజు నవ వధువు అత్తారింటికి వచ్చింది. ఫిబ్రవరి 26న ఉదయం భర్తతోపాటు అతని బంధువులందరికీ టీ, కాఫీలు ఇచ్చింది. మధ్యాహ్నం వంటకూడా చేసిన యువతి.. సాయంత్రం పూట కడుపులోనొప్పి అంటూ కన్నీరుపెట్టుకుంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే కాసేపటికే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందంటూ వైద్యులు తెలిపారు.  బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. 

ఈ వార్త వినగానే పిడుగుపడ్డట్లు ఉలిక్కిపడ్డారు. ఆ నవ వధువు, ఆమె బంధువులు తమను మోసం చేశారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను తాను భార్యగా స్వీకరించట్లేదని వరుడు తేల్చి చెప్పేశాడు. పెళ్లి రోజు ఆమె పెద్ద లెహంగా ధరించినపుడే నాకు ఏదో తేడాగా అనిపించింది. కానీ లావుగా ఉందేమో అనుకుని పట్టించుకోలేదు. మొదటి  రాత్రి కూడా నాకు దూరంగానే పడుకుంది. కొత్తగా పెళ్లైందని నేను పట్టించుకోలేదు అంటూ వరుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వార్త వీడియో వైరల్ అవుతోంది. 

Also read: Trump Warning : హమాస్‌‌కు ట్రంప్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.. ‘వారి శవాలు మీకెందుకు’

Advertisment
తాజా కథనాలు