Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం

విదేశాంగ మంత్రి జైశంకర్ పై ఖలీస్థానీ సానుభూతిపరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ ప్రయత్నం జరిగింది. దాంతో పాటూ భారత జెండాను అవమానించేలా ప్రవర్తించారు.

author-image
By Manogna alamuru
New Update
Jai shankar

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మీద ఈరోజు కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. జైశంకర్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. భద్రత లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. లండన్ లో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఖలిస్థానీ సానుభూతిపరులు..సడెన్ గా జైశంకర్ కారు దగ్గరకు వచ్చి దాడికి యత్నించాడు. భారత జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమవడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు. దూసుకొచ్చిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Also Read: TS: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అదే కలిసి వచ్చిందా.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు