UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ!

60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన బామ్మ భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. ఆవేదన చెందుతూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
old women young boy

old women young boy Photograph: (old women young boy)

UP Viral News: ప్రేమకు, వయస్సుకు అసలు సంబంధం లేదని కొందరు అంటుంటారు. ప్రేమ అనేది ఏ వయస్సులో అయినా పుడుతుంది. ఈ మధ్య కాలంలో అయితే వయస్సుతో సంబంధం లేకుండా కొందరు వివాహం చేసుకుంటున్నారు. తక్కువ వయస్సు ఉన్న అమ్మాయి ఎక్కువ ఏళ్లు ఉన్న అబ్బాయిని వివాహం చేసుకుంటుంది. అలాగే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయి తన కంటే పెద్దదైన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారు. చెప్పుకుంటూ పోతే ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ బామ్మ లవ్ స్టోరీ(Viral Love Story) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 60 ఏళ్లు ఉన్న ఓ బామ్మ 30 ఏళ్ల యువకుడిని ప్రేమించి తనతో వెళ్లిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్‌(Uttarpradesh)లో చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ఆ యువకుడితోనే కలిసి జీవించాలని..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని కాన్పూర్‌కి చెందిన ఓ వృద్ధ దంపతులు ఉన్నారు. ఇదే ఏరియాలో ఉంటున్న ఓ యువకుడితో బామ్మకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 60 ఏళ్ల బామ్మ 30 ఏళ్ల యువకుడితో పారిపోయింది. సమాజం ఎలా అనుకున్నా కూడా.. ఆ తనతోనే కలిసి జీవించాలని భావించి ఆ యువకుడితో వెళ్లిపోయింది. బామ్మ భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బామ్మ గతంలో కూడా ఓ యువకుడితో వెళ్లిపోయిందని భర్త ఆవేదన చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

 

ఇది కూడా చూడండి:  Nandyala : నంద్యాలలో పేలిన సిలిండర్ ఇద్దరు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు