/rtv/media/media_files/2025/01/20/E82bESNFLTsDcXFQE4NG.jpg)
Trump security Photograph: (Trump security )
గతేడాది నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఈ నెల 22న 47వ దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు డొనాల్డ్ ట్రంప్. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అక్రమ వలసదారులపై యమ సీరియస్ గా ఉన్నారు. వారిని తిరిగి స్వదేశాలకు పంపేందుకు అనేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా అమెరికానే అక్రమ వలసదారులను గుర్తించి.. 500 సైనిక విమానాల ద్వారా వారిని స్వదేశాలకు తిప్పి పంపుతుంది. తాజాగా యూఎస్ సర్కారు.. బ్రెజిల్ నుంచి అక్రమంగా వచ్చి అమెరికాలో జీవిస్తున్న పలువురిని గుర్తించి తిరిగి స్వదేశానికి పంపించింది. ఈ క్రమంలో వారికి నరకం చూపించింది. జైల్లో ఉన్న ఖైదీల పట్ల చూపించే కనికరం కూడా చూపించకుండా దారుణంగా వారిని తరలించడంపై బ్రెజిల్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అమెరికాలో అక్రమంగా వలస పొందుతున్న 80 మంది బ్రెజీలియన్లను ఆదివారం రోజు తిరిగి స్వదేశానికి పంపించింది. అయితే బ్రెజిల్ ఉత్తర నగరమైన మనౌస్‌లో ఆ విమానం ల్యాండ్ అవ్వగా.. 80 మంది బ్రెజీలియన్ పౌరులు చేతులకు సంకెళ్లతో ఉన్నట్లు అక్కడి అధికారులు చూశారు. ఈక్రమంలోనే వారందరినీ దాని గురించి ప్రశ్నించగా అమెరికా వారికి చూపించిన నరకం గురించి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read: Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!
బాత్రూంకు వెళ్లలేక..
ముఖ్యంగా తాము విమానంలో ఎక్కడానికి ముందే తమ చేతులకు సంకెళ్లు వేసినట్లు వెల్లడించారు.ఆ పై విమానంలోకి వచ్చి కూర్చున్నాకా తమ కాళ్లు కూడా కట్టేశారని బ్రెజీలియన్లు వివరించారు. విమానంలో ఉండగా.. దాహం వేస్తుందని అడిగితే కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. బాత్రూం వెళ్లాలని చెప్పినా వారు పట్టించుకోకుండా తమను అలాగే ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీళ్లు లేక బాత్రూంకు వెళ్లలేక అనేక మంది అస్వస్థతకు గురయ్యారని వివరించారు.
ముఖ్యంగా యూఎస్ నుంచి ఇదే విమానంలో వచ్చిన ఎడ్గార్ డా సిల్వా మౌరా అనే 31 ఏళ్ల కంప్యూటర్ టెక్నీషియన్ మాట్లాడాతూ.. బహిష్కరణకు ముందే తాను 7 నెలల పాటు అమెరికా నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు. విమానంలో పలు సాంకేతిక సమస్యల వల్ల ఏసీలు కూడా పని చేయకపోవడంతో.. అనేక మంది మూర్చపోయారని చెప్పాడు.
21 ఏళ్ల లూయిస్ ఆంటోనియా రోడ్రిగ్స్ శాంటోస్ మాట్లాడుతూ.. ఏసీలు నాలుగు గంటలు పని చేయలేదని దీని వల్ల పలువురు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడినట్లు వివరించాడు. తాము వచ్చిన విమానం ఆగ్నేయ నగరమైన హారిజోంటేలో ల్యాండ్ కావాల్సిందని కానీ సాంకేతిక సమస్యల కారణంగా మనౌస్‌లో ల్యాండ్ చేశారని స్పష్టం చేశారు.
అక్రమ వలసదారుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది. బ్రెజిలియన్ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది.
Also Read: TG high court: 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ సమయంలో థియేటర్లకు అనుమతించొద్దు: హైకోర్టు
Also Read:Telangana: ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా ఏడు రోజులు సెలవులు.. తేదీలు ఇవే!