/rtv/media/media_files/2025/01/28/4C5nCERGg9OIQiYu1Ddw.jpg)
Occult Worship
Kurnool : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో క్షుద్ర పూజల (Occult Worship) కలకలం రేపాయి. ఈ సందర్భంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై దుండగులు హత్యాయత్నం చేశారు. విద్యార్థిని జుట్టుని కట్ చేసి, పదునైన కత్తితో చెయ్యిని కోసే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. బయపడిన దుండగులు పరారయ్యారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా కాలేజీ యజమాన్యం విఫయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలియనివ్వలేదు. తోటి విద్యార్థి ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. కాగా కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, మహిళాసంఘాల నాయకులు కళశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
Also Read : కాలేజీలో క్షుద్ర పూజల కలకలం
Also Read : సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం
SR Educational Institutions - Occult Worship
ఈనెల 26న రాత్రి 11.30 గంటల సమయంలో హాస్టల్‌లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తి బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని చంపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆమె నిద్రలో ఉండగా జుట్టును కత్తిరించడంతో పాటు హత్య చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిద్రలేచిన విద్యార్థిని దుండగున్ని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో అతను పారిపోయాడు.
ఆ తర్వాత గదిలో చూడగా బెడ్ పై కిల్‌యూ (Kill You) అని లేటర్, పదునైన కత్తి, రెండు ముక్కలు చేసిన నిమ్మకాయ, ఉండడటంతో క్షద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తు్న్నారు. అయితే అందులో ఏడుగురు విద్యార్థులు ఉండగా బాగా చదవడంతో పాటు తరగతిలో ఫస్ట్ వస్తు్న్న విద్యార్థినినే టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీంతో మిగిలిన విద్యార్థినీలకు చెందిన బంధువులే ఆమెను టార్గెట్ చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది.
గతంలో కూడా ఒక అమ్మాయిపై ఇలాగే క్షద్ర పూజలు జరిగియాని అప్పట్లో ఆమె కళ్లు తిరిగి పడిపోయిందని విద్యార్థినీలు చెబుతున్నారు. కాగా మళ్లీ క్షద్ర పూజలు జరగడంతో విద్యార్థినీలు బయాందోళనకు గురవుతున్నారు.
Also Read : ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు
Also Read : ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం!