UP Crime: దారుణం.. మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లో కాలుతూనే స్కూటీపై

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళకు దుండగుడు నిప్పంటించడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు కాలుతున్న మంటల్లోనే స్కూటీ నడుపుతూ ఆస్పత్రికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

New Update
UP Woman Set On Fire Reaches Hospital On Her Scooter, Dies

UP Woman Set On Fire Reaches Hospital On Her Scooter, Dies

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళకు దుండగుడు నిప్పంటించడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు కాలుతున్న మంటల్లోనే స్కూటీ నడుపుతూ ఆస్పత్రికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత నెలలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్నో సమీపంలోని ఫరూఖాబాద్‌ దగ్గర్లో నిషా సింగ్‌ (33) అనే వివాహితను దీపక్ అనే వ్యక్తి గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. 

Also Read: నేపాల్‌లో మంత్రుల ఇళ్లకు నిప్పు.. దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని ?

UP Woman Set On Fire

ఆమెను తనతో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఇటీవలే నిషా తన తండ్రి ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి ఓరోజు బయటకు వెళ్లేందుకు స్కీటీపై బయలుదేరింది. ఆమెను గమనించిన దీపక్ స్కూటీని అడ్డుకున్నాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి దీపక్, అతడి స్నేహితులు కలిసి నిషాకు నిప్పంటించారు. ఆమె కేకలు వేస్తూ స్కూటీ నడుపుతూ ఆస్పత్రికి వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను మరో ఆస్పత్రికి తరలిస్తుండగా నిషా ప్రాణాలు కోల్పోయింది.  

Also Read: పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్‌ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. తన కూతురి ఒంటికి దీపక్ నిప్పంటించాడని బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీపక్ కొంత కాలంగా వేధిస్తున్నాడని నిషా(Nisha) చాలాసార్లు చెప్పిందని ఆమె సోదరి నీతూసింగ్ చెప్పారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.         

Also Read: మస్తు ట్విస్ట్.. భర్తతో గొడవ పడి నదిలో దూకిన భార్య.. కాపాడిన మొసలి..!

Advertisment
తాజా కథనాలు