VIRAL NEWS: మస్తు ట్విస్ట్.. భర్తతో గొడవ పడి నదిలో దూకిన భార్య.. కాపాడిన మొసలి..!

UPలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఒక మహిళ తన భర్తతో గొడవ పడి గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దూకిన తర్వాత నదిలో మొసలిని చూసి భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న చెట్టు ఎక్కింది. గ్రామస్థులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

New Update
VIRAL NEWS

VIRAL NEWS

భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారి బీభత్సం సృష్టిస్తాయి. కూర బాగోలేదని ఒకరు, అన్నం ఉడకలేదని మరొకరు, అడిగింది తీసుకురాలేదని ఇంకొకరు.. ఇలా చిన్న చిన్న విషయాలకే కోపాలు తెచ్చుకుని ఆవేశంతో, ఆక్రోశంతో ఊగిపోతుంటారు. ఆ సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా.. క్షణకావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఒక్కోసారి ఆ చిన్న విషయానికే పెద్ద గొడవ చేసి రక్తపాతం సృష్టిస్తుంటారు. అలాంటి సమయంలో ప్రాణాలు కూడా పోయే సంఘటనలు ఉన్నాయి. 

woman jumped Ganga river

ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్యా భర్తల మధ్య టీ విషయంలో చిన్న గొడవ చెలరేగింది. ఆ చిన్నది కాస్త చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో భార్య కోపంతో సమీపంలో ఉన్న నదిలోకి దూకింది. అయితే క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమెకు దూకిన తర్వాత తప్పు అనిపించి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఒడ్డుమీదున్న భారీ మొసలిని చూసి ఒక్కసారిగా ఖంగుతింది. ఆపై భయంతో వణికిపోయిన ఆ మహిళ.. చివరికి ఒక పని చేసి ప్రాణాలు కాపాడుకుంది. అయితే మరి ఆ మహిళ ఏం చేసి ప్రాణాలు కాపాడుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ ఘటన కాన్పూర్‌లోని అహిర్వాన్‌లో చోటుచేసుకుంది.  సురేష్ అనే వ్యక్తి తన భార్య మాల్టితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి కూడా అలానే తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్యను టీ తయారు చేయమని అడగగా.. తాను బాగా అలసిపోయానని.. ఇప్పుడు పెట్టలేనని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. 

ఆ వాదన పెరిగి పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కోపంతో రగిలిపోతున్న మాల్టి.. తమ ఇంటి సమీపంలో ఉన్న నది వంతెన వద్దకు చేరుకుంది. అనంతరం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకింది. అయితే దూకిన తర్వాత.. తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు భావించింది. దీంతో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని.. ఒడ్డు వైపుకు ఈదుకుంటూ వచ్చింది. ఆమె ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా నీటిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. 

దీంతో ఆమె ఒక్కసారిగా భయంతో గజగజ వణికిపోయింది. ఇంకాస్త ముందుకు వెళ్తే మొసలి తనపై దాడి చేస్తుందని భావించింది. అప్పుడే తనకు సమీపంలో ఒక చెట్టు కనిపించింది. ఎలాగైన తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో.. ఆమె త్వరగా దానిపై ఎక్కి రాత్రంతా అక్కడే కూర్చుంది. ఉదయం కాగానే సమీప గ్రామం నుండి ప్రజలు గంగా నది ఒడ్డున వెళుతుండగా.. చెట్టుపై కూర్చున్న మాల్టి సహాయం కోసం కేకలు వేసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

Advertisment
తాజా కథనాలు