Nepal: నేపాల్‌లో మంత్రుల ఇళ్లకు నిప్పు.. దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని ?

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ఆందోళకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

New Update
Tension continues to grip Nepal as fresh protests erupted on the streets again

Tension continues to grip Nepal as fresh protests erupted on the streets again

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ఆందోళకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ న్యూ బనేశ్వర్, కాట్మాండ్ లోయలోని పలు ప్రాంతాల్లో మంగళవారం యువత ఆందోళనలకు దిగారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి ప్రృథ్వీ సింగ్ గురుంగ్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రపతి రామ్‌ చంద్ర పౌడెల్, ఇంధన శాఖ మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

ఇదిలాఉండగా నేపాల్‌లో ఫేక్‌ న్యూస్‌, విద్వేష ప్రచారాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్ మీడియా యాప్స్‌ను ఐటీ శాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని ఆదేశించింది. తాము విధించిన రూల్స్‌ను పాటించాలని చెప్పింది.  ఇందుకోసం ఆగస్టు 28 వరకు గడవు విధించింది. అయితే గడువు పూర్తయినప్పటికీ సోషల్ మీడియా యాప్స్‌ ఐటీ శాఖ వద్ద రిజిస్టర్‌ కాకపోవడంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌తో సహా మొత్తం 26 సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి యువతలో  తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది.

Also Read: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం..  భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భా
అంతేకాదు నేపాల్‌లో పెరిగిపోతున్న అవినీతి, వారసత్వ రాజకీయాల వంటి అంశాలపై కూడా ప్రజలు రగిలిపోయారు. సోమవారం రాజధాని కాట్మాండ్‌లో జెనరేషన్ జెడ్ విప్లవం అనే పేరుతో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అనంతరం ఈ నిరసనలు నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ ఆందోళనలు పోలీసులతో హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. దీంత 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.

చివరికి ఈ వ్యవహారంపై స్పందించిన నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన బ్యాన్‌ను ఎత్తివేసింది. అయితే మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే హోం శాఖ మంత్రి రమేశ్ లేఖక్, అలాగే వ్యవసాయశాఖ మంత్రి రామ్‌నాథ్‌ అధికారి తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే మరికొందరు నిరసనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలిప్‌ పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు . 

Also Read: పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్‌ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు