/rtv/media/media_files/2025/09/09/trump-2025-09-09-12-29-21.jpg)
Trump Must Pay E. Jean Carroll $83 Million In Defamation Case, Appeal Court Rules
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ ఎదురైంది. కాలమిస్ట్ ఈ.జీన్ కరోల్ వేసిన పరువు వష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై విచారించిన న్యూయార్క్‌లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు.. ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు(రూ.733 కోట్లు) చెల్లించాలంటూ ఆదేశించింది. ఇటీవల సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ట్రంప్ చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చింది. జ్యూరీ విధించిన పరిహారం కరెక్ట్‌గానే ఉందంటూ తీర్పునిచ్చింది.
Also Read: గాజా ఖాళీ చేసి వెళ్లిపోండి.. స్థానికులకు ఇజ్రాయెల్ సంచలన వార్నింగ్
ఈ కేసులో అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొందని.. తాను పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ కోర్టులో వాదించారు. దీన్ని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1996లో మన్‌హట్టన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ట్రంప్.. కరోల్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో కోర్టు ఆయనకు 5 మిలియన్ డాలర్లు(రూ.400 కోట్లు) జరిమానా విధించింది.
Also Read: అదే జరిగితే..సగం సుంకాలను తిరిగి చెల్లిస్తాం..అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్
గతేడాది డిసెంబర్‌లో కూడా అప్పీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది. అయితే సోషల్ మీడియాలో ట్రంప్ తరచుగా జీన్ కరోల్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగతంగా వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీంతో కరోల్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్‌పై పరువు నష్టం కేసు చేశారు. చివరికి దీనిపై విచారణ జరిపిన కోర్టు రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..