పాకిస్తాన్‌కు ఇండియా మరో బిగ్‌షాక్ ఇచ్చింది. రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు గగనతలం మూసివేయాలని ఇండియా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన విమానాలను ఇండియా మీదుగా వెళ్లడాన్ని నిషేదించింది. దీంతో పాకిస్తాన్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
పాక్ నౌకలను ఇండియన్ పోర్టుల్లోకి అనుమతించకూడదని ప్రకటించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు పాక్ గగనతలం మూసివేసింది. ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారిపోయింది. అలాగే పాకిస్తాన్ పౌరులకు వీసాలు కూడా రద్దు చేసింది ఇండియా.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
( india pak war | pakistan airlines | flight | attack in Pahalgam)