/rtv/media/media_files/2025/05/28/Ev6nmI2Gc5tttB88RtMq.jpg)
Tv Actress Dipika Kakar diagnosed with liver cancer
Dipika Kakar: బాలీవుడ్ ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కక్కర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇటీవలే తనకు స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ (liver-cancer) నిర్దారణ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగ పోస్టును పంచుకున్నారు.
Also Read : టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు
Also Read : పెళ్లి వేదికపైకి ఖడ్గమృగం సడెన్ ఎంట్రీ.. బిత్తరపోయిన అతిథులు! వీడియో వైరల్
లివర్ క్యాన్సర్
గత కొన్ని వారాలు మాకు చాలా కష్టంగా గడిచింది. కడుపులో విపరీతమైన పై భాగంలో నొప్పి రావడంతో ఆస్పత్రుల చుట్టు తిరిగాము. దీనికి సంబంధించి స్కాన్ చేయించగా.. లివర్ లో టెన్నిస్ బాల్ సైజు ట్యూమర్ ఉందని తెలిసింది. దీనిని స్టేజ్ 2 దశ క్యాన్సర్ గా వైద్యులు నిర్దారించారు. ఇది మా జీవితంలో ఎదుర్కుంటున్న అత్యంత కఠినమైన కాలం! ఈ ప్రాణాంతక లివర్ క్యాన్సర్ ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. దైవబలం, అభిమానుల ఆశీర్వాదం, ఆదరణతో ఈ ప్రమాదాన్ని విజయవంతంగా అధికమిస్తాను. దయచేసి మీ ప్రేయర్స్ లో నన్ను కూడా ఉంచండి అంటూ రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/28/dHbkEGdU0rxqcfp3HSVn.png)
Also Read : జూబ్లీహిల్స్ పబ్‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం
దీపికా హిందీలో 'నీర్ భరే తేరే నైనా దేవి' టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్, టీవీ షోలతో అలరించింది. 2018లో హిందీ బిగ్ బాస్ సీజన్ 12 విజేతగా నిలిచింది. అంతేకాదు సెలెబ్రెటీ మాస్టర్ చెఫ్ షోలో కూడా 8వ స్థానంలో సొంతం చేసుకుంది. ఇలా వరుస సీరియల్స్, టీవీ షోలతో కెరీర్ పీక్స్ లో ఉండగా.. నటుడు షోయబ్ ఇబ్బహీంను వివాహం చేసుకుంది.
లివర్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి?
- కారణం లేకుండా బరువు తగ్గడం
డైట్ చేయకపోయినా లేదా శారీరక శ్రమ లేకపోయినా ఈజీగా బరువు తగ్గడం లివర్ క్యాన్సర్ కి హెచ్చరికగా చెబుతారు.
- పొట్ట పై భాగంలో నొప్పి
కడుపులో నొప్పి ముఖ్యంగా కుడి వైపు పై భాగంలో నొప్పి ఉంటే,.. అది లివర్ సమస్యలకు సంకేతం కావచ్చు.
- వాంతులు
తక్కువగా తిన్నా పొట్ట నిండుగా అనిపించడం.. తరచూ వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఆకలిగా ఉండదు. రోజూ తినే పరిమాణం కూడా తినలేకపోవడం జరుగుతుంది. అలాగే కడుపు ఒక్కసారిగా ఉబ్బినట్లు అనిపిస్తుంది.
అలసటగా ఉండడం, శరీర శక్తి తగ్గిపోవడం కూడా ఈ వ్యాధికి ఒక రకమైన సంకేతాలు. అయితే కొన్ని సందర్భాల్లో పై లక్షణాలన్నీ సాధారణమైనవి కూడా కావచ్చు. అయినప్పటికీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్