Farmers Protest: మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేయనున్న రైతులు..
రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.