Union Cabinet: కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో APకి గుడ్‌న్యూస్

ఈ మంత్రివర్గం సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | Short News

New Update
Central cabinet

Central cabinet

కేంద్ర కేబినెట్ మంగళవారం భేటీ అయ్యింది. ఈ మంత్రివర్గం సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా మారబోతోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సెమీకండక్టర్ యూనిట్ కేటాయించింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు దేశంలో మరో మూడు సెమీకండక్టర్ యూనిట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.4594 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీ సహా ఒడిశా, పంజాబ్‌కు సెమీకండక్టర్లును మంజూరు చేసింది. లక్నో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నాలుగు ప్రాజెక్టులకు రూ.4594 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

Also Read :  మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్

Union Cabinet Meeting

కేంద్ర కేబినెట్(Union Cabinet) ఈ నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. ఎలక్ట్రానిక్స్, సాంకేతిక రంగాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక గొప్ప ఊపునిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) సెమీకండక్టర్ పాలసీని రూపొందించి, రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం నుంచి లభించిన ఈ కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చినట్లయింది.

ఈ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని అధికారులు తెలిపారు.

సెమీకండక్టర్లు నేటి డిజిటల్ యుగంలో అత్యంత కీలకమైనవి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం భారతదేశం సెమీకండక్టర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ దిగుమతులను తగ్గించి, "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సెమీకండక్టర్ యూనిట్లను ప్రారంభించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలకు కూడా ఈ యూనిట్లు కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తోంది.

Also Read :  బిహార్‌లో వింత ఘటన.. పిల్లికి రెసిడెన్స్​ సర్టిఫికేట్​కావాలంటూ దరఖాస్తు

central-cabinet-meeting | latest-telugu-news | andhra-pradesh-news | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు