/rtv/media/media_files/2025/08/12/cat-2025-08-12-13-33-56.jpg)
After dogs and tractors, cat seeks residence certificate in Bihar’s Rohtas district
సాధారణంగా విద్యా, ఉద్యోగవకాశాల కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బిహార్‌లోని రోహ్‌తస్ జిల్లాలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ పిల్లికి రెసిడెన్స్ (నివాస ధ్రువీకరణ) సర్టిఫికేట్ కావాలంటూ దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. క్యాట్ కుమార్ పేరుతో ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు. తండ్రి పేరు కటీ బాస్, అలాగే తల్లి పేరు కటియా దేవిగా నమోదు చేశారు. అలాగే ఓ పిల్లి ఫొటోను కూడా అప్‌లోడ్ చేశారు. పిల్లికి సంబంధించి ఇలా దరఖాస్తు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
ఈ విషయం చివరికి రోహ్‌తస్ జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై ఆయన కఠిన చర్యలకు ఆదేశించారు. పోలీసులు కూడా దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నాస్రిగంజ్ ఆర్టీపీఎస్ ఆఫీస్‌కు ఓ పిల్లి పేరుతో రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలని కోరుతూ అప్లికేషన్ వచ్చింది. దీనిపై అధికారులు కూడా స్పందించారు. ఇందులో పేరుతో, పాటు చిరునామాను తప్పుగా ఇచ్చారని తెలిపారు. ఓ పిల్లి ఫొటో కూడా అప్లికేషన్‌లో పెట్టారని.. ప్రభుత్వ సంస్థలను దిగజార్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ ఉద్యోగి కౌశల్ పటేల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆన్‌లైన్ టెక్నాలజీని దుర్వినియోగం చేసి మోసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై కేసు నమోదు విచారణ చేపట్టారు. మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ఆన్‌లైన్ సిస్టమ్‌ను ఇలాంటి దుర్వినియోగ పనులకు వాడకూడదని సూచిస్తున్నారు.
మరోవైపు దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ కూడా స్పందించారు. ఫేక్ ఫొటో, చిరునామా పేరుతో ఓ నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు వచ్చిందని దీనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనకు పాల్పడ్డ వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సర్టిఫికేట్‌ల కోసం వేలాదిమంది దరఖాస్తులు చేశారు. ఈ క్రమంలోనే చాలావరకు ఇలాంటి ఫేక్ దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే కుక్క, ట్రాక్టర్, రామ్, సీతా పేర్లతో కూడా కొందరు కావాలనే ఫేక్ అప్లికేషన్లు పెట్టారు. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందుకే కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..