/rtv/media/media_files/2025/05/17/cn8I4MaLSL4l2gC1cnIm.jpg)
NIA arrests two ISIS sleeper cell
ISIS Sleeper Cells Arrest: దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ముంబై ఎయిర్ పోర్టు(Mumbai Airport) సమీపంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జకార్తా కు చెందినవారని, అక్కడి నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్‌లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారని ఎన్‌ఐఏ తెలిపింది.వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: IDF: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు 115 మంది మృతి
ఈ ఇద్దరూ తీవ్రవాదులు2023 పుణే బాంబు తయారీ కేసు లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి పరారీలో ఉండటంతో వారిపై ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఉగ్రవాదులిద్దరూ ఇండోనేషియాలో తలదాచుకుంటున్నట్లు తేలింది. కాగా ప్రస్తుతం జకర్తా నుంచి ముంబైకి తిరిగి వచ్చే క్రమంలో ఎన్ఐఏ అధికారుల చేతికి చిక్కినట్లు తేలింది.
Also Read: J&K: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ..కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ముఫ్తీ
స్లీపర్‌సెల్స్ సభ్యులపై క్రిమినల్ కేసు..
కాగా భారత్ కు చెందిన పలువురు ఐఎస్ఐఎస్ కి సానుభూతిపరులుగా పనిచేస్తున్నారు. దేశంలోని పలు రహస్య విషాయలను వారికి చేరవేస్తున్నారు. కాగా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఈ ఇద్దరితో పాటు ఇప్పటికే అరెస్టు అయిన మరో 8 మంది ఐఎస్ఐఎస్ స్లీపర్‌సెల్స్ సభ్యులపై క్రిమినల్ కుట్ర కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. భారత దేశంలో శాంతి, సామాజిక సామరస్యత లేకుండా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలని వీరంతా కుట్ర పన్నుతున్నారని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేశారు. తమ కార్యకలాపాల ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.. దేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలన్న ఉద్దేశంతోనే ఐఎస్ఐఎస్ స్లీపర్‌సెల్స్ పనిచేస్తున్నాయని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఈ ఉగ్రవాదులు పుణేలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేశారని అధికారులు వెల్లడించారు.
Also Read: Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్
కాగా ఐఎస్ఐఎస్ భారతదేశంలో శాంతి, సామరస్యను రూపుమాపి, అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు దానికోసమే స్లీపర్‌సెల్స్‌ను దేశంలో వివిధ ప్రాంతాలకు పంపింది. ఐఎస్ఐఎస్ ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం సీపర్ సెల్స్‌కు శిక్షణ ఇచ్చి బాంబులు ఎలా తయారు చేయాలి, ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు ఎలా పేల్చాలన్న దానిపై ముందుగానే వారికి నోట్ ఇస్తుంది. దీంతో ఉగ్రవాదులు ఎవరికీ అనుమానం రాకుండా విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. దేశంలో అలజడి సృష్టించే ఏ శక్తులను వదిలి పెట్టబోమని ఎన్‌ఐఏ అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: RCB VS KKR: జోష్ మళ్ళీ మొదలు..ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్