IDF: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు 115 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. దాడుల్లో ఒక్క రోజులోనే 115 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతలాకుతలం అయిపోయిన గాజా...ఇజ్రాయెల్ తాజా దాడులతో మరింత దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. 

New Update
idf

Israel Attacks On Gaza

హమాస్ లొంగిపోయేవరకు విడిచిపెట్టేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. బందీలను విడిచిపెడితే కానీ దాడులు ఆపమని చెబుతోంది. హమాస్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే బందీలను విడిచిపెడతామని అంటోంది. ఈ రెండింటి నడుమ గాజాలో అమాయకులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఒక్కరోజులోనే 115 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. ఖాన్ యూనిస్ లోని అల్ అక్సా మార్టిర్స్ ఆసుపత్రి ప్రాంతం, సదరన్ గాజాపై ఐడీఎఫ్ బాంబుల వర్షం కురిపించింది.  

53 వేల మంది మృతి..

ఇదిలా ఉండగా..ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 53వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయాలపాలయ్యారు. మరో 62వేల మంది కనిపించకుండాపోయారు. వీరందరూ శిథిలాల కింద చిక్మకుకుని ఉంటారని అంచనా. మరోవైపు గాజాల దారుణ పరిస్థితులు నెలకున్నాయి. అక్కడ చాలామంది తిండి లేక విలవిలలాడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం గాజాలో కరువు తాండవిస్తోంది. హమాస్ కు అందకూడదని ఐడీఎఫ్.. నిత్యావసర సరుకులను అడ్డుకోవడంతో...అక్కడ తాగడానికి సరైన నీరు కూడా లేక జనం విలవిలలాడుతున్నారు. 

 

 

today-latest-news-in-telugu | idf war latest | hamas

Also Read: USA: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను..అమెరికాలో భారతీయులపై ప్రభావం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు