/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
71 Maoists Surrender to Police in Chattisgarh
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత బలగాలు తమ ఆపరేషన్లను కొనసాగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు(maoists surrendered). అయితే మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది. వీళ్లలో కేశ్‌కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులు కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపారు.
Also Read: మెట్రో స్టేషన్‌లో కండోమ్ ప్యాకెట్లు.. షాకైపోయిన ప్రయాణికులు
71 Maoists Surrender To Police
కాంకేర్ ప్రాంతం నుంచే 50 మావోలు లొంగిపోగా.. నారాయణ్‌పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోయారు. అంటే మొత్తంగా 71 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వాళ్లలో 13 మంది మహిళా నక్సలైట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన వాళ్లు తమ ఆయుధాలను కూడా ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఆపరేషన్ కగార్ కొనసాగడం, పార్టీ సుప్రీం కమాండర్ అయిన నంబాల మృతి తర్వాత మావోయిస్టు పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది.
Also Read: ఎంపీకి బిగ్ షాక్.. రూ.10 కోట్లు ఇవ్వకుంటే నీ కొడుకుని చంపేస్తాం..
ఇదిలాఉండగా ఇటీవల మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ, పొలిటిబ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే సెంట్రల్ కమిటీ మెంబర్ ఆశన్న కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కానీ మరో వర్గం మాత్రం తమ ఆయుధాలు విడిచే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాయి. అయితే తాజాగా మరో 71 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మావోయిస్టులు లొంగిపోతారని తెలుస్తోంది.
Follow Us