/rtv/media/media_files/2025/01/30/yi5OPMLHOlhlF6feOOs7.jpg)
live in relation ship Photograph: (live in relation ship)
live-in relationship : ఉత్తరాఖండ్‌లో జనవరి 28 నుంచి యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. సహజీవనం చేయాలనుకుంటే ఇకపై వారు రిజిస్టేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం 16 పేజీల ఫారమ్ నింపాలి. అలాగే.. యూనిఫాం సివిల్ కోడ్ గైడ్‌లైన్స్ ప్రకారం.. 74 నిషేధిత సంబంధాలను కూడా ఇందులో ఉన్నాయి. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్ కోసం రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు, గతంలో వారు ఎవరితో సహజీవనంతో ఉన్నారో వివరాలు అందజేయాలి. ఇండియాలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
ఇది కూడా చదవండి :Bengaluru Viral Jobs: లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం: కంపెనీ వినూత్న ప్రచారం..!
సహజీవనం చేసే వారు జిల్లా రిజిస్ట్రార్‌తో నమోదు చేసుకోవాలి. లేదంటే వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొత్తగా ప్రారంభించబడిన UCC పోర్టల్ 3వ భాగంలో ucc.uk.gov.in స్పెషల్ రిలేషన్స్ గురించి వివరిస్తోంది. ఇది రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సహజీవనం రిజిస్టేషన్ చేసుకునే వారు ఆధార్‌తోపాటు వారి అడ్రస్ డిటేల్స్ ఇవ్వా్ల్సి ఉంటుంది. సహజీవనం చేసే వారి ఏజ్, బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. వారి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే తల్లిదండ్రులకు పర్మిషన్ కావాలి.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
యూనిఫాం సివిల్ కోడ్ కింద దాదాపు 74 నిషేధిత సంబంధాల ఉన్నాయి. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్ ఉండాలనుకునే వారికి తల్లి, తండ్రి, అమ్మమ్మ, కుమార్తె, కుమారుడు, కొడుకు వితంతువు, కుమార్తె కొడుకు వితంతువు, సోదరి, సోదరి కుమార్తె, సోదరుడి కుమార్తె, తల్లి సోదరి, తండ్రి సోదరి వరస ఉండకూడదు. సహజీవనంలో పిల్లలు పుడితే వారికి బర్త్ సర్టిఫికేట్ అవసరం. లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ఉన్న నెలలోపు రిజిస్టేషన్ చేసుకోకపోతే.. రూ.1,000 ఫీజు విధిస్తారు. సహజీవనంలో స్త్రీ భాగస్వామిని విడిచిపెట్టినట్లయితే, ఆమె భరణం కోరవచ్చు. లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో పుట్టిన బిడ్డను కూడా చట్టబద్ధమైనదిగా చట్టం గుర్తిస్తుంది. తర్వాత ఇద్దరుకి అంగీకారం ఉంటేనే వివాహం చేసుకోవచ్చు.