USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

author-image
By Manogna alamuru
New Update
crash

Air Plane, Helicopter Crash

వాషింగ్టన్ లో రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుండగా..పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది. దీంతో రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. హెలికాఫ్టర్ లో పైలెట్లు ఇద్దరు ఉండగా..విమానంలో 60 దాకా ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు.

ఒకే సమయంలో ల్యాండ్ అయ్యాయి..

రాత్రి 8.30 గంటల ప్రాంతంలో  పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసెంజర్ వియాన కాన్సాస్ లోని విషిటా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇది వాషింగట్ రోనాల్డ్ రీగన్ ఎయర్ పర్ట్ రన్ వే మీద దిగేందుకు సిద్ధమైంది. ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్న రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్‌-60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ దీనిని ఢీ కొట్టింది. రెండు ఆకాశంలోనే గుద్దుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తరువాత హెలికాఫ్టర్, విమానం రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి.  

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలన

ప్రమాదం జరిగిన వెంటనే రీగన్ ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. అన్ని సేవలను వెంటనే నిలిపేశారు. ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది ఇంకా తెలియలేదని...కానీ కచ్చితంగా చాలా మందే మృతి చెంది ఉంటారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తెలిపారు. హెలికాఫ్టర్, ఫీఎస్ఏ ప్యాసెంజర్ విమానం రెండూ ఒకే సమయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిండంతోనే ప్రమాదం సభవించిందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఏ రెండు విమానాలకు ఒకేసారి ల్యాండ్ అవడానికి అనుమతి ఇవ్వరు. అది కూడా ఒకే ప్రదేశంలో ఇవ్వడానికి అస్సలు ఇవ్వరు. కానీ ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియడం లేదని అంటున్నారు. 

Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం

Advertisment
తాజా కథనాలు