/rtv/media/media_files/2025/01/30/X91nR53ZhjAc2AnXkRzx.jpg)
Bengaluru company Chief Dating Officer job requires breakups, situationship expertise
Bengaluru Viral Jobs: సాధారణంగా జాబ్ ఆఫర్(Job Offers) చేసే కంపెనీలు అభ్యర్థుల క్వాలిఫికేషన్(Qualificaton) లేదా వర్క్ ఎక్స్‌పీరియన్స్(Work Experience) చూస్తారు. దానిబట్టి ఉద్యోగం నిర్ణయిస్తారు. అనంతరం వారి టాలెంట్‌కు తగ్గ సాలరీని ఇస్తారు. అయితే ఇక్కడ ఓ కంపెనీ మాత్రం వినూత్న ప్రచారం చేసింది. ఎలాంటి క్వాలిఫికేషన్ లేని అభ్యర్థులకు మాత్రమే జాబ్ ఇస్తామని తెలిపింది.
Also Read : నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
ఆ కంపెనీ జాబ్ కోసం అభ్యర్థుల విద్యార్హతలు అవసరం లేదని తెలుపుతూ.. లవ్‌లో కనీసం ఒక్కసారి అయినా బ్రేకప్(Love Break Up) అయిన వారికి మాత్రమే ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. దీంతో ఆ కంపెనీ నోటిఫికేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కంపెనీ వినూత్న ప్రచారం
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ ఈ వినూత్న ప్రచారం చేసింది. ఈ కంపెనీ తాజాగా ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ (CDO) కోసం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఆ ప్రకటనలో.. లవ్, ఆన్‌లైన్ డేటిగ్ సహా ఇతర వాటిలో బాగా నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపింది.
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
నిబంధనలు వర్తిస్తాయ్..
అంతేకాకుండ కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు కలిగి ఉండాలని ఆ జాబ్‌కు నిబంధనలు పెట్టింది. ఇవి ఉన్నవారు ఆ ఉద్యోగానికి అర్హులని పేర్కొంది. ఇవి మాత్రమే కాకుండా ప్రస్తుతం కొత్త డేటింగ్ నిబంధనలపై కూడా పరిజ్ఞానం కలిగి ఉండాలని చెప్పింది.
Hiring Alert!
— Nimisha Chanda (@NimishaChanda) January 29, 2025
We are looking for a Chief Dating Officer.
Are you the go-to friend for dating advice? We’re hiring someone who lives and breathes dating culture.
The self-proclaimed matchmaker who can decode “ghosting,” “breadcrumbing,” and every new dating buzzword in the… pic.twitter.com/yqyJJiCVJy
అలాగే కొత్త వాటిని క్రియేట్ చేయడనికి ధైర్యం ఉన్నవారు అర్హులుగా పేర్కొంది. 2 నుంచి 3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలని తెలిపింది. అలాగే వీటిలో డేటింగ్ యాప్‌లో ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలంది. అయితే క్యాట్‌ఫిషింగ్‌కు తావులేదని తెలిపింది. ఇవన్నీ ఉన్నవారు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించిన జీతాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.