TikTok: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్‌ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

టిక్‌టాక్‌ యాప్‌ సేవలు మళ్లీ భారత్‌లోకి రానున్నాయని ప్రచారం నడుస్తోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పాయి.

New Update
TikTok ban not lifted, says govt amid reports of its website being accessible

TikTok ban not lifted, says govt amid reports of its website being accessible

ఒకప్పుడు టిక్‌టాక్‌ యాప్‌ భారత్‌లో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చాలామంది ఈ యాప్‌కు అడిక్ట్ అయిపోయారు. కొందరు రీల్స్‌ మోజులో పడి ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇక 2020లో గాల్వన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తలు చెలరేగాయి. దీంతో భద్రతపరమైన కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్ చేసింది. దీంతో పాటు చైనాకు చెందిన అనేక యాప్‌లపై నిషేధం విధించింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికా టారిఫ్‌ల తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్‌ యాప్‌ సేవలు మళ్లీ భారత్‌లోకి రానున్నాయని ప్రచారం నడుస్తోంది. 

Also Read: ధర్మస్థల కేసులో మరో పెద్ద ట్విస్ట్..నాకసలు కూతురే లేదన్న అన్యన్య భట్ తల్లి

దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్ వస్తుందన్న ప్రచారాన్ని ఖండించాయి. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పాయి. టిక్‌టాప్‌పై దేశంలో ఇంకా నిషేధం కొనసాగుతోందని పేర్కొన్నాయి.  టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని తెలిపాయి. ప్రస్తుతం దీనిపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని స్పష్టం చేశాయి. టిక్‌టాక్‌ వెబ్‌సైట్‌ను కూడా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్‌లిస్టులో ఉంచాయని చెప్పాయి. కానీ కొందరు యూజర్లకు అది ఎలా అందుబాటులకి వచ్చిందో అనేదానిపై క్లారిటీ లేదని వెల్లడించాయి. 

Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త

చాలామంది యూజర్లు శుక్రవారం టిక్‌టిక్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. వైబ్‌సైట్‌ ఓపెన్ అవుతున్నప్పటికీ అందులో యూజర్లు లాగిన్ కాలేకపోతున్నామని.. వీడియోలు అప్‌లోడ్ చేయలేకపోతున్నామని తెలిపారు. మరోవైప్‌ యాప్‌ స్టోర్స్‌లో కూడా ఈ యాప్‌ అందుబాటులో లేదు. ప్రస్తుతం భారత్-చైనా మధ్య దౌత్యపరంగా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ అందుబాటులోకి వచ్చిందన్న ప్రచారం చర్చనీయమవుతోంది. మొత్తానికి అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదని.. టిక్‌టాక్‌పై ఇంకా నిషేధం కొనసాగుతోందని కేంద్ర ఐటీ శాఖ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. 

Also Read: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య

ఇదిలాఉండగా 2020లో గాల్వాన్‌ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది జూన్‌ నెలలో చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేంధించింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మరో 118 చైనీస్‌ యాప్స్‌ను బ్యాన్ చేసింది. చైనా తీరు వల్ల భారతీయుల సమాచార భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలుగుతోందన్న కారణంలో మోదీ సర్కార్‌ చైనీస్‌ యాప్‌లను బ్యాన్ చేసింది. ఇందులో టిక్‌టాక్, పబ్‌జీ, షేరిట్, యూసీ బ్రౌజర్, క్లాష్ ఆఫ్ కింగ్స్ లాంటి చాలా యాప్‌లు ఉన్నాయి. 

Also Read: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా?

Advertisment
తాజా కథనాలు