Trump New Plan: భారతదేశంలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్.. ట్రంప్ కుట్ర అదేనా?

అమెరికాతో టారీఫ్ ల యుద్ధం నడుస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ తన మాట వినేందుకు కొత్త వ్యూహాన్ని పన్నారు ట్రంప్. భారత్ లో అమెరికా రాయబారిని మార్చారు. కొత్త రాయబారిగా సెర్గియో గోర్ ను నియమించారు. 

New Update
sergio

Sergio Gor

అమెరికా అధ్యక్షుడు భారత్ ను పదే పదే రెచ్చగొట్టే చర్యలను చేస్తున్నారు. భారత్ తన దారికి రావట్లేదనే అసహనంలో  ఉన్న ట్రంప్..ఎలాగైనా తన మాటవినేలా చేసుకోవాలని కొత్త వ్యూహాన్ని రచించారు. ఇందులో భాగంగా భారత్ పై మరింత ఒత్తిడి తెచ్చే దిశగా ఇప్పుడు దానికి తోడు రాయబారిని మారుస్తూ  నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య యుద్ధం నడుస్తున్న వేళ ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం వైట్ హౌస్ పర్సనల్ డైరెక్టర్ గా ఉన్న సెర్గియో గోర్ ను భారత నూతన రాయబారిగా నియమించారు. భారత్‌ రష్యా బంధం బలపడుతున్న వేళ సర్గియోను రంగంలోకి దింపారు ట్రంప్. ఈ పదవి ఖాళీ అయిన సుమారు 8 నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.  నియామకం ఈయన ట్రంప్ అత్యంత విధేయుడు. చాలా తక్కవు సమయంలోనే ఆయన పరిపాలనా విభాగంలో చేరారని చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

పక్కా ప్లాన్ ప్రకారం...మూడు దేశాలకూ చెక్ పెట్టే దిశగా..

భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ ను నియమిస్తున్నాను. ఈయన దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ విధులు నిర్వర్తిస్తారు. భారత్, రష్యా, చైనా బంధాలు బలపడుతున్న వేళ సర్గియోకు అదనపు బాధ్యతలను ఇచ్చారు. స్పెషల్ ఎన్వాయ్ ఫర్ సౌత్ సెంట్రల్ ఏసియన్ ఎఫైర్స్‌గా నియమించారు. భారత్‌కు వెళ్లేంతవరకు సెర్గియా ప్రస్తుతం వైట్‌హౌస్‌లో తన పాత విధులను నిర్వహిస్తారని ట్రంప్ పోస్ట్ లో రాశారు. సెర్గియో తనకు అత్యంత సన్నిహితుడని..చాలా ఏళ్ళుగా తనకు మద్దుతుగా ఉంటూ..ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేశారని చెప్పారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా అతని పాత్ర చాలా కీలకమైనదని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను పాలనలోకి వచ్చాక సెర్గియో, అతని టీమ్ చాలా తక్కువ సమయంలోనే గొప్ప పనులు చేశారు. దాదాపు 4 వేల మంది దేశ భక్తులను నియమించుకున్నారు. దాని ద్వారా ఫెడరల్‌ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల్లోని 95 శాతం ఉద్యోగాలను భర్తీ చేశారంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు భారతదేశానికి కూడా అతి ముఖ్యమైన కార్యం నిర్వహించడానికి వస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశంలో తన ఎజెండా పూర్తి చేయడానికి...అమెరికాను మరింత గొప్ప తీర్చిదిద్దడానికి సెర్గియో తోడ్పడతారని ట్రంప్ తెలిపారు. ఆయన గొప్ప రాయబారి అవుతాడని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు